Home ఎడిటోరియల్ అదానీ ఎగ‘మేత’!

అదానీ ఎగ‘మేత’!

ఎగుమతి బిల్లుల్లో  ఎడతెగని మోసం 

అదానీ గ్రూపు కంపెనీలు ఎగుమతుల ప్రోత్సాహకాలను దుర్వినియోగం చేసినట్లు డిఆర్‌ఐ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో దొంగ కంపెనీల మాటున అవి అత్యంత వేగంగా ‘ సర్కులర్ వాణిజ్యం’ నిర్వహించడం ద్వారా ఈ మోసానికి పాల్పడ్డాయని తెలుస్తోంది. ఒకదానితో ఒకటి లింకై ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఈ అక్రమ వాణిజ్యాన్ని సాగించాయి. ఆ కంపెనీలు మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడ్డాయి. అయిదు భారతీయ కంపెనీలకు తోడు అదానీ ఎంటర్‌ప్రయిజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) గ్రూపు నేరుగా, పరోక్షంగా 45 విదేశీ కార్పొరేట్ సంస్థలను కూడా అదుపులో పెట్టుకొన్నట్లు డిఆర్‌ఐ వివరించింది.  ఆ గ్రూపు మునుపటి నామం  అదానీ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్.

Modi-adani

పన్నులను ఎగవేసినట్లు, మనీ లాండరింగ్‌కు పాల్ప డుతున్నట్లు, ప్రోత్సాహకాలను కాజేసినట్లు గౌతమ్ అదానీ సారథ్యంలోని కార్పొరేట్ సంస్థల గ్రూపుపై రెవెన్యూ ఇంటిలిజెన్స్ డైరెక్టరేట్ (డిఆర్‌ఐ) ఆరోపించింది. ఆ మొత్తం రూ. 1000 కోట్లుంటుందని కూడా ఆ సంస్థ ఆరోపించింది. కట్‌చేసి, నగిషీ పట్టిన వజ్రాలు, బంగారు నగల వ్యాపారంలో ఈ అక్రమానికి అదానీ గ్రూపు పాల్పడిందని కూడా రెవెన్యూ డైరెక్టరేట్ ఆరోపించింది. ‘ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ’ డిసెంబర్ 31 సంచికలో పరంజయ్ గుహా థాకుర్తా ,అద్వైతరావు పాలెపు, ఫింజానీ జైన్ ఈ వ్యవహారాన్ని బయటపెట్టారు. ప్రధాని నరేంద్రమోడీకి అదానీ సన్నిహితునిగా పేరొం దారు. కాబట్టి వ్యవహారం మోడీ పరివారానికి కఠిన పరీక్షగా మారింది.

అదానీ గ్రూపు కంపెనీలు ఎగుమతుల ప్రోత్సా హకాలను దుర్వినియోగం చేసినట్లు డిఆర్‌ఐ పేర్కొంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో దొంగ కంపెనీల మాటున అవి అత్యంత వేగంగా ‘ సర్కులర్ వాణిజ్యం’ నిర్వహించడం ద్వారా ఈ మోసానికి పాల్పడ్డాయని తెలుస్తోంది. ఒకదానితో ఒకటి లింకై ఉన్న కార్పొరేట్ కంపెనీలు ఈ అక్రమ వాణిజ్యాన్ని సాగించాయి. ఆ కంపెనీలు మనీ లాండరింగ్‌కు కూడా పాల్పడ్డాయి.

అయిదు భారతీయ కంపెనీలకుతోడు అదానీ ఎంటర్‌ప్రయిజెస్ లిమిటెడ్ (ఎఇఎల్) గ్రూపు నేరుగా, పరోక్షంగా 45 విదేశీ కార్పొరేట్ సంస్థలను కూడా అదుపు లో పెట్టుకొన్నట్లు డిఆర్‌ఐ వివరించింది. ఆ గ్రూపు మునుపటి నామం అదానీ ఎక్స్‌పోర్ట్ లిమిటెడ్. ఆర్థిక మంత్రిత్వ శాఖలో రెవెన్యూ డైరెక్టరేట్ దర్యాప్తు విభాగం. ఈ కేసులో తన ఆదాయ ప్రయోజనాల రక్షణకు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం పట్ల ప్రభుత్వం చిత్రంగా తాత్సారం చేస్తోంది.

నల్ల డబ్బు పై యుద్ధం తరుణంలో..

పత్రిక బయటపెట్టిన ఈ వ్యవహారం ‘పన్నుల ఎగవేత, గుప్త ధనం పని పడతాననీ మోడీ బాహాటంగా చాటుతున్న సమ యంలో చోటు చేసుకొంది. ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ నేరుగా గాని, పరోక్షం గాగాని ఎఇఎల్‌తో సంబంధాలున్నవే. లేదా వాటిలో కొన్ని ఎఇఎల్ అదుపులోనే ఉన్నవి. ఫ్రయిట్ ఆన్ బోర్డ్ ( ఎఫ్‌ఒబి) ప్రకటనలో బాగా తేడా పాడాలున్నట్లు బయటపడింది. ఎఫ్‌ఓబి అనేది ఎగుమతి చేసిన లేదా సరఫరా చేసిన సరకుకు రవాణా చార్జీలను అమ్మే వారు చెల్లించాలన్న నియమం. ఈ లెక్కలను ఎఇఎల్ తప్పుగా ప్రకటించిందన్నది ప్రధాన ఆరోపణ. కట్ చేసి, పాలిష్ పెట్టిన వజ్రాలు, బంగారు నగల వాణిజ్యంలో ఈ అక్రమాలు చోటు చేసుకొన్నాయన్నది ఆరోపణ. ఎగుమతులను కృత్రిమ పద్ధతులలో ఎక్కువ చేసి చూప డానికి ఆ గ్రూపు , దాని అనుబంధ సంస్థలు తెగించడం ద్వారా ఎగుమతి ప్రోత్సాహకాలను కాజేశాయని డిఆర్‌ఐ వెల్లడించింది. ఇందుకోసం అవి ‘సర్కులర్ ట్రేడింగ్’ అక్రమానికి పాల్పడ్డాయి.

విలువ పెంచిచూపి, ప్రోత్సాహకాలు మింగారు

విదేశీ వాణిజ్యం డైరెక్టరేట్ జనరల్ ( డిజిఎఫ్‌టి) ఇచ్చే ప్రోత్సాహకాలను అదానీ కంపెనీలు కాజేశాయి. ఆహార ధాన్యాలనుంచి, జౌళి వస్త్రాలదాకా ఇంతకుముందు ఎఇఎల్, దాని అనుబంధ కంపెనీలు ఎగుమతి చేసేవి. 2002-03లో అదానీ గ్రూపు ఎగుమతుల లావాదేవీల మొత్తం చాలా స్వల్పంగా రూ. 400 కోట్లు. కాని 2003-04లో ఎఇఎల్ ఎగుమతుల లావాదేవీల మొత్తం హఠాత్తుగా 11 రెట్లు పైకి ఎగసింది.
కచ్చితంగా చెప్పా లంటే ఆ మొత్తం 1,181 శాతం పెరిగింది. జస్టిస్ ఎకె సిక్రి, రోహింటన్ పి నారీమన్ తో కూడిన అత్యున్నత న్యాయస్థానం డివిజన్ బెంచి ఆ సంస్థలు ఎలా ఎగుమతి ప్రోత్సాహక నియమాలను ఉల్లంఘించి తప్పుడు మార్గంలో వాటిని కాజేశారో కఠిన పదజాలంతో ఎండగట్టింది. భారతదేశం ముడి వజ్రాల ఉత్పత్తికి పేరుబడకపోయినా ఆ ఎగుమతులను ఎఇఎల్ గ్రూపు, దాని అనుబంధ కంపెనీలు ఎలా ఎక్కువ చేసి చూపాయో స్పష్టమైన ఆధారాలతో చీల్చి చెండాడింది.

సుప్రీం ఉత్తర్వు పాఠం

‘ఒకేసెట్ డైమండ్లను రకరకాలుగా తిప్పారు. భారతదేశ భూభాగాన్ని కాని, విదేశాలలో వినియోగదా రులనుగాని అవి ఎన్నడూ చేరలేదు. అటువంటి ఎగుమ తుల విలువ గత రెండేళ్లలో రూ. 15 వేల కోట్లను మించాయి. ఈ ఎగుమతుల్లో అనేక మంది దుబాయి, షార్జాలోని తమ సొంత సంస్థలకే ఎగుమతి చేశారు. ఆ గ్రూపు ఎగుమతి లావాదేవీల సంస్థల వారికే ఎగుమతి చేశారు. దుబాయ్‌లో ఆ నగలపై 5 శాతం దిగుమతి సుంకం పడింది. అందుచేత భారత్‌లో నగలుగా ప్రకటించిన సరకు మొత్తాన్ని దిగుమతి సుంకం ఎగవేతకై దుబాయ్‌లో చెత్తా చెదారంగా ప్రకటించారు.

సర్కులర్ ట్రేడింగ్ జరిపిన ఉదంతాలు కొన్నివేలు ఉన్నాయి. ఆ సమాచారం డిఆర్‌ఐ నోటీసులలో పొందుపరిచి ఉంది. ఆ కంపెనీలు 5 శాతం- 10 శాతం విలువను తమ ఆఫీసు అకౌంట్ పుస్తకాలలో ఎక్కువ చేసి చూపాయి. ఆ వజ్రాలను నీటిలో మరగబెట్టి శుభ్రం చేయడం ఒక్కటే జరగాల్సి ఉండగా ఆ పనులకు కూడా అదనపు విలువ జోడించారు’. ఇలా ఎగుమతి బిల్లులను అదానీ కంపెనీలు ఎక్కువ చేసి చూపాయి. పన్నుల ఎగవేత, ప్రోత్సాహకాల చోరీ అనే ద్వంద్వ లక్షాలతో అంతకు తెగించారన్నది సుప్రీంకోర్టు చురకలతో స్పష్టమవుతోంది.