Search
Saturday 22 September 2018
  • :
  • :

సిఎంకు అపాయింట్‌మెంట్ ఇవ్వని ప్రధాని

kerala-cm-pinaryi-vijayan

న్యూఢిల్లీ: కేరళ సిఎం పినరయి విజయన్ కు ప్రధాని మోడీని కలవడానికి అపాయింట్ మెంట్ దొరకడం లేదు. ఒకటి రెండు సార్లు కాదు, మోడీ అపాయింట్ మెంట్ పినరయికు దొరకకపోవడం ఇది 4 సారి కావడం గమనార్హం. కేరళకు సంబంధించి రేషన్ బియ్యం కేటాయింపుల్లో అక్రమాలకు సంబంధించి ప్రధాని తో చర్చలు జరపడానికి అనుమతి కావాలని పినరయి మోడీ పిఎంవొను కోరారు. పినిరయి మోడీ అపాయింట్ కొరినప్పుడల్లా పిఎంవొ వర్గాలు ఆయన విజ్ఞప్తిని తిరస్కరిస్తున్నాయి. బియ్యం కేటాయింపులపై చర్చించడానికి అవసరమైతే కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తో భేటీ కావొచ్చని పినరయికి పిఎంవొలు అధికారలు సూచించారు. ఈ విషయంపై కేరళ సిఎం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.  గత సంవత్సరం మార్చి 20న కూడా ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ పినరయికి దొరకలేదు. ఆ సందర్భంలో బడ్జెట్ కేటాయింపులపై ప్రధానితో చర్చలు జరపడానికి కేరళ సిఎం పినరయి అనుమతి కోరారు.

Comments

comments