Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

పోషకాహారం ఫుల్

modi

2022 నాటికి లక్ష సాధన, కేంద్ర పథకాలు ఫలితాలనిస్తున్నాయి : ప్రధాని మోడీ  

న్యూఢిల్లీ : స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు నిండబోతున్న 2022 సంవత్సరం నాటికి భారత్ లో పోషకాహార లోపాన్ని నివారించడంలో మం చి ఫలితాలు వస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. భారత్‌లో పోషకాహార లోపం, పిల్లల్లో ఎదుగుదల మందగించడం, సంబంధిత సమస్యలపై శనివారం ఆయన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఆయా దేశాలు తీసుకున్న చర్యలు కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. దేశం లో పోషకాహార లోపం, ఎదుగుదల మందగించ డం, పుట్టినప్పుడు తక్కువ బరువు ఉండడం, అనీమియా వంటి సమస్యలను పూర్తిగా నివారించేందుకు పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సివుందని అన్నారు. 2022 సంవత్సరం నాటికి ఈ విషయంలో మంచి ఫలితాలను మనం చూడబోతున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్ అభియాన్, మిషన్ ఇంద్రధనుష్, బేటీ బచావోబేటీ పడావో, ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకాలు పోషకాహారం విషయంలో మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఈ సందర్భంగా సీనియర్ అధికారులు ప్రధాన మంత్రి దృష్టికి తెచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి అన్ని పథకాలను కలిసి పోషకాహార లోపాన్ని అధిగమించేలా చేయాల్సివుందని మోడీ ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. గణనీయమైన ఫలితాలను సాధించాలంటే పోషకాహార ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యవసరమని అన్నారు.

Comments

comments