Home జాతీయ వార్తలు వాజపేయితో మోడీకి పోలికా?

వాజపేయితో మోడీకి పోలికా?

Stalin Nomination for DMK Presidential Postచెన్నై: రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని బిజెపితో జీవితంలో చేతులు కలిపే ప్రసక్తి లేదని డిఎంకె అధ్యక్షుడు ఎంకె స్టాలిన్ స్పష్టం చేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయితో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీని పోల్చడానికి వీల్లేదు. మోడీ నాయకత్వంలో కూటమి కూడా ఆరోగ్యకరంగా లేదు..ఇలాంటి వాతావరణంలో బిజెపితో పొత్తు పెట్టుకునే అవకాశమే లేదు అని ఒక ప్రకటనలో స్టాలిన్ పేర్కొన్నారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మోడీ చాస్తున్న స్నేహహస్తాన్ని ఆయన ప్రస్తావిస్తూ గతంలో ఎన్నడూ లేని విధంగా మోడీ నాయకత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం రాష్ట్రాల హక్కులను కాలరాస్తోందని, మోడీ తనను తాను వాజపేయితో పోల్చుకోవడం విడ్డూరంగా ఉందని స్టాలిన్ వ్యాఖ్యానించారు.

Modi himself comparing with Vajpayee says Stalin