Home అంతర్జాతీయ వార్తలు సడన్‌గా లాహోర్‌లో మోడీ

సడన్‌గా లాహోర్‌లో మోడీ

55నవాజ్ షరీఫ్‌తో భేటీ   ఊపందుకున్న చర్చల ప్రక్రియ   – పాక్ విదేశాంగ కార్యదర్శి

లాహోర్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అనూహ్య రీతిలో ఆకస్మికంగా పాకిస్థాన్ పర్యటనకు వెళ్లారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో లాహోర్ చేరుకున్నారు. సాయంత్రం 4.45కు మోడీ ఇక్కడి అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయ ంలో దిగగానే పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి వారిరువురూ ప్రత్యేక హెలికా ప్టర్‌లో షరీఫ్ నివాసం జతి ఉమ్రాహ్‌కు వెళ్లారు. ప్రోటో కాల్ నిబంధనలకు అతీతంగా , షెడ్యూల్ లేకుండానే ప్ర ధాని ఉన్నట్టుండి పాకిస్థాన్‌కు వెళ్లడం కీలక చర్చనీ యాంశంగా మారింది. శుక్రవారమే నవాజ్ షరీఫ్ 66వ జన్మదినం కావడం, ఆయన మనవరాలి పెళ్లి కూడా జరగడం విశేషమే. ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇరువురు ఇ క్కడి 1700 ఎకరాల విస్తీర్ణంలో నెలకొని ఉన్న షరీఫ్ నివాసంలో ద్వైపాక్షిక చర్చలు ప్రారంభించారు. మోడీ లాహోర్ పర్యటన వివరాలను చివరి వరకూ రహస్యంగా ఉంచారు. తొలుత ఆయన లాహోర్‌వస్తున్నారని మీడి యాలో వార్తలు వచ్చాయి. భద్రతా కారణాలతో మోడీ ప ర్యటనను గోప్యంగా ఉంచినట్లు వెల్లడైంది. ఆయన రాక సందర్భంగా స్థానికంగా అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడు నెలల వ్యవధిలో మోడీ , షరీఫ్‌లు సమా వేశం కావడం ఇది మూడోసారి. ఉభయదేశాల మధ్య సంబంధాలను తిరిగి సజావుగా మలిచేందుకు మోడీ పర్యటన తలపెట్టినట్లు భారత అధికార వర్గాలు సమర్థిం చాయి. మోడీకి సాదర స్వాగతం పలుకుతూ షరీఫ్ ఆ యనకు పుష్పగుచ్ఛాలు అందించారు. ప్రతిగా మోడీ షరీ ఫ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. షరీఫ్ సోద రుడు , పంజాబ్ సిఎం షాబాజ్ షరీఫ్, పాక్ ఆర్థిక మం త్రి ఇషాక్ డార్ ఇతరులు విమానాశ్రయంలో మోడీకి స్వాగతం పలికారు. భారత దౌత్యవేత్త టిసిఏ రాఘవన్ కూడా హాజరు అయ్యారు. విమానాశ్రయం నుంచి నిమి షాల వ్యవధిలోనే మోడీ షరీఫ్ నివాసానికి చేరారు. మో డీ పర్యటనను జన్మదిన దౌత్యంగా టీవీ ఛానల్స్ విశ్లేషిం చాయి. డిసెంబర్ 25 విశేష రీతిలో పాకిస్థాన్ వ్యవస్థాప కులు మహ్మద్ అలీ జిన్నా జయంతి కూడా. ఇరుదేశాల నేతలూ పలు అంశాలను చర్చించారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ అధికారికంగా ట్వీట్ చేసింది. ప్రధాని అయిన తరువాత మోడీ పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ప్రత్యేకంగా మోడీ రాకను పురస్కరించుకుని విమానాశ్రయం నుంచి శివార్లలోని షరీఫ్ నివాసం వర కూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎయిర్‌పోర్టు సమీపం లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు. వారితో పాకిస్థాన్ రేంజర్లు కూడా లాహోర్‌కు వచ్చి భద్రతను పర్యవేక్షించారు. ప్రధాని షరీఫ్‌నివాసంలో మోడీ దాదా పు 80 నిమిషాలు ఉన్నారు. మోడీతో పాటు 11 మంది తో కూడిన భారత ప్రతినిధి బృందం తాత్కాలికంగా అం దుకున్న 72 గంటల వీసా ఏర్పాట్లతో షరీఫ్ నివాసానికి చేరుకుంది. ఆఫ్ఘన్‌కు ప్రధాని వెంట వెళ్లిన భారత ప్రతినిధి వర్గంలోని మరికొందరు లహోర్ విమానాశ్ర యంలోనే ఉన్నారు. వారికి అల్పాహారాలను పాక్ ప్రధా ని తరఫున అందించారు.మొత్తం మీద ప్రధాని మోడీ లాహోర్ టూర్ దాదాపు గంటన్నర పాటు జరిగింది.
షరీఫ్ ఇంట పెళ్లి వేడుకలకు ప్రత్యేక అతిథి
పాక్ ప్రధాని షరీఫ్ మనవరాలి పెళ్లి వేడుకలకు భారత ప్రధాని ప్రత్యేక అతిథిగా విచ్చేసారని, వేడుకలలో పా ల్గొన్నారని భారత విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్వీట్ చేశారు. షరీఫ్ ఆయన వెంట ఉండి అతి థి మర్యాదలు చేసినట్లు వెల్లడించారు. లాహోర్ శివార్ల లోని రాయ్‌విండ్‌లో షరీఫ్ నివాసంలో పెళ్లి జరింది. జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలను వ్యక్తిగతంగా తెలియచేయడం ద్వారా దౌత్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలనే ఆకస్మిక నిర్ణయం ప్రధాని మోడీ శుక్రవా రం ఉదయమే తీసుకున్నారు. షరీఫ్‌కు కాబూల్ నుంచి ఫోన్ చేసి తాను వస్తున్నానని, లాహోర్‌లో మనవరాలి పె ళ్లి కూడా ఉంది కదా..ఎలాగూ సాల్‌గిరా కూడా ఉంది క దా అని చెప్పారు. దీనితో ముందు విస్తుపోయిన షరీఫ్ తరువాత ఏర్పాట్లు చేసేశారు. భద్రతాపరంగా తగు కట్టు దిట్టమైన ఏర్పాట్లకు ఆదేశాలు జారీ చేశారు. చివరికి తా ను లాహోర్ పర్యటనకు వెళ్లుతున్నట్లు, షరీఫ్‌ను కలుసు కోనున్నట్లు మోడీ తన ట్విట్టర్‌లో తెలియచేసే వరకూ ఈ విషయం గురించి రెండు దేశాల మీడియాకు విషయం తెలియకుండా ఉంది. ఇటీవలే అనూహ్య రీతిలో పాకి స్థాన్‌కు ప్రధాని మోడీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను పంపించడం కూడా తక్షణ నిర్ణయమే. ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ చర్చలలో కదలిక ఏర్పడింది. ఇప్పుడు షరీఫ్‌తో భేటీ అదీ అత్యంత ఆహ్లాదకర నేపథ్యంలో , అదీ షరీఫ్ జన్మదినం, మనవరాలి పెళ్లి సందర్భంగా కల వడం కీలకంగా అందులోనూ షరీఫ్‌ను హత్తుకునే విధం గా మారిందని భావిస్తున్నారు. కీలక పర్యటనల వివరా లను ఇటీవలి కాలంలో ప్రధాని మోడీ ముందుగా తన ట్విట్టర్ ద్వారా ముందుగా తెలియచేయడం తరువాతనే అవి మీడియాకు తెలియడం జరిగిపోతోంది. అమెరికా అధ్యక్షులు ఒబామా భారత్ పర్యటన గురించి ఆ మధ్య లో మోడీ ట్విట్టర్ ద్వారా వెల్లడించేవరకూ విషయం మీడియాకు తెలియకుండా ఉంది. ఇప్పుడూ లాహోర్ పర్యటన కూడా ఇదే విధంగా జరిగింది.
స్వచ్ఛమైన దేశవాళీ నెయ్యితో వంటకాలు
అతిథిగా వచ్చిన మోడీకి షరీఫ్ నివాసంలో పలు రుచిక రమైన కూరగాయలతో కూడిన పసందైన విందు ఇచ్చా రు. మోడీకి అత్యంత ఇష్టమైన సాగ్, పప్పు, కూరగా యలతో కూడిన ఆహారం వడ్డించారు. పూర్తిగా దేశీ నెయ్యితో కూరలు తయారు చేసినట్లు షరీఫ్ నివాస వర్గా లు తెలిపాయి. తొలుత భారత ప్రధానికి ఆయన బాగా ఇష్టపడే కశ్మీరీ తేనీటిని అందించారు. లాహోర్‌లోని షరీ ఫ్ నివాసానికి చేరగానే మోడీకి షరీఫ్ కుమారుడు హస న్, కుటుంబ సభ్యులు సాదర స్వాగతం పలికారు. ఇరు వురు ప్రధానులు ప్రత్యేకంగా విడిగా సమావేశం అవు తున్న హాల్‌లోకి షరీఫ్ తల్లి ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారని అనధికారిక వర్గాలు తెలిపాయి. షరీఫ్ తల్లిని గమనించగానే మోడీ లేచి వెళ్లి ఆమె కాళ్లకు దం డం పెట్టారు. నివాసం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు వారి ఆతిథ్యానికి, ప్రత్యేకంగా తనకు చాలా ఇష్టమైన వంట కాలు అందించినందుకు కుటుంబ సభ్యులకు షుక్రియా చెప్పారు. దాదాపుగా షరీఫ్ కుటుంబ సభ్యులందరినీ పలకరించారు. వధూవరులను ఆశీర్వదించారు.