Search
Wednesday 17 October 2018
  • :
  • :

ఆ అవినీతిపై మోడీ ఎందుకు నోరు విప్పడం లేదు

Congress Chief Rahul Gandhi criticizes PM Modi

ఢిల్లీ:  రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలులో ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి పాల్పడ్డాడని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు.  ఫ్రాన్స్ కు చెందిన డసో కంపెనీ  భారత్ తో జరిగిన యుద్ధ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. గురువారం రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఇంత జరుగుతున్న ప్రధాని ఎందుకు నోరు విప్పడంలో లేదని ప్రశ్నించారు. ప్రధాని అవినీతిపరుడై ఉండి అవినీతికి వ్యతిరేకంగా మోడీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఫ్రాన్స్ ప్రధాని హోలన్ గతంలో యుద్ధ విమానాలలో అవినీతి గురించి మాట్లాడారని, ఇప్పుడు డసో కంపెనీ కూడా భారత్ అవినీతికి పాల్పడిందని చెప్పిందన్నారు. మోడీ భారత్ కు ప్రధాని కాదని అనిల్ అంబానీ కే ప్రధాని అని  మండిపడ్డారు.

ఫ్రాన్స్ జరిగిన ఒప్పందంలో అవినీతిని కప్పిపుచ్చేందుకు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆ దేశ పర్యటనకు వెళ్తున్నారని ధ్వజమెత్తారు.  రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భారత భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవడంలో తమకెలాంటి సంబంధం లేదని ఫ్రెంచ్ ప్రభుత్వం పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. అంతేకాదు ఒప్పందాల్లో తమ భాగస్వాములను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఫ్రెంచ్ కంపెనీలకు ఉంటుందని కూడా పేర్కొంది. రాఫెల్ యుద్ధ విమానాల తయారీలో భాగస్వామిగా రిలయన్స్ డిఫెన్స్‌ను ఎంచుకోవాలని భారత ప్రభుత్వమే డసాల్ట్ ఏవియేషన్‌కు సూచించిందని ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే  వెల్లడించిన విషయం విధితమే.

Modi is a Corrupt Person: Rahul Gandhi 

Telangana news

Comments

comments