Home అంతర్జాతీయ వార్తలు భారత్, మలేషియా బంధం బలోపేతం

భారత్, మలేషియా బంధం బలోపేతం

int

మహతిర్ మహ్మద్‌కు ప్రధాని మోడీ అభినందన

కౌలాలంపూర్ : తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన మలేషియా ప్రధానమంత్రి మహతిర్ మహ్మద్‌ని భారత ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. ఇరువురి మధ్య స్నేహపూరిత వాతావరణంలో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంపొందించుకోవడంపై వారు చర్చించారు. మూడు రోజుల్లో మూడు దేశాల్లో సుడిగాలి పర్యటనకు బయలుదేరిన భారత ప్రధాని నరేంద్ర మోడీ రెండవ రోజు మలేషియాలో 92 యేళ్ల మహతిర్ మహ్మద్‌ని కలుసుకున్నారు. భారత్, మలేసియా దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ పర్యటనలో చర్చలు జరిపామని మోడీ ట్వీట్ చేశారు.
ఇరు దేశాల మధ్య ఆర్ధిక, సాంస్కృతిక సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించారు. 2003లో రాజకీయాల్లో నుంచి తప్పుకున్న మహతిర్ త 92 యేళ్ల వయసులో ప్రతిపక్ష కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికనల్లో ఘన విజయం సాధించారు. తిరిగి ప్రధానమంత్రిగా మే 10న బాధ్యతలు చేపట్టారు.