Home జాతీయ వార్తలు ఫకీర్‌నంటారు.. 10లక్షల సూటు వేస్తారు : కేజ్రీవాల్

ఫకీర్‌నంటారు.. 10లక్షల సూటు వేస్తారు : కేజ్రీవాల్

Arvind_Kejriwal

న్యూఢిల్లీ:  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యాఖ్యలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్  కేజ్రీవాల్ అపహాస్యం చేశా రు. ప్రధానమంత్రి తనకు తాను ఫకీర్‌నని చెప్పుకుంటారు,  పది లక్షల రూపాయల విలువగల సూటు ధరించి ప్రపంచ పర్యటన జరుపతారని కేజ్రీవాల్  వ్యాఖ్యానించారు. ‘మోడీ గారూ మీకు మీరు సన్యాసినని చెప్పుకు ంటారు. ప్రతిరోజు నాలుగు జతల కొత్తబట్టలు ధరిస్తారు. రూ.10లక్షల విలువగల సూటు ధరించి ప్రపంచ పర్యటన జరుపుతారు. ప్రజలకు మీ మాటలపై నమ్మకం పోయింది’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.

మొరా దాబాద్‌లో శనివారం ఒక ర్యాలీలో ప్రసంగిస్తూ  పెద్దనోట్ల రద్దు ద్వారా నల్లధనం దాచుకున్న వారికి నిద్రలే కుండా చేసినందుకు తనను లక్షంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని మోడీ అన్నారు.  ‘లంచ గొండులకు, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాటం జరపడం నేరమైనట్లు నన్ను తరుముతున్నారు. వారు నన్నేం చేయగలరు. నేను సన్యాసిని. జోలె తీసుకుని వెళ్లిపోతాను’ అని మోడీ అన్నారు.  ‘మోడీ వ్యవస్థలను నాశనం చేస్తున్నారు.  65 ఏళ్లలో దేశం సాధించిన దాన్ని మోడీ ఐదేళ్లలో నాశనం చేస్తారు.’ అని కేజ్రీవాల్ మరొక ట్వీట్ చేశారు. ‘ఈ ప్రధానమంత్రి వ్యవస్థలను ఒక్కొక్కదాన్ని చంపేస్తున్నారు. రిజర్వు బ్యాంక్, సిబిఐ, యూని వర్శిటీలు, ఇప్పుడు న్యాయవ్యవస్థ’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.