Home ఎడిటోరియల్ ‘ఆమె’ కథను దరిజేర్చుతారా?

‘ఆమె’ కథను దరిజేర్చుతారా?

edit

జాదూకి ఝప్పీ ప్రధాని మోడీని దిగ్భ్రాంతి పరిచింది. ఒక ఆలింగనంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి గీత దాటారు. మోడీ మార్క్ ఆలింగనాన్ని నాటకీయంగా ఆయనకే ఇచ్చారు. తాను రాజకీయంగా బిజెపిని వ్యతిరేకిస్తున్నా మోడీని ‘ద్వేషించటం’ లేదని చాటి చెప్పారు. దాన్ని ‘పప్పూ భాషణ’ అనండి, చౌకబారు మున్నాభాయ్ నటన అనండి, పార్లమెంటరీ మర్యాదకు విరుద్ధం అనండీ ఆ చర్య అలజడి సృష్టించటమేగాక రాజకీయ ‘హిందూ’ సర్కిల్స్‌ను తికమకపెట్టింది.
కాంగ్రెస్ నాయకత్వంలో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానం తుస్సుమంటుందని ముందే నిర్ణయమైనట్లుగా 126325 ఓట్లతో వీగిపోయింది. ఐక్యత కూడా ప్రదర్శితం కాలేదు. కాని కీలక సమస్యలపై ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. నిరుద్యోగం, రాఫెల్ ఒప్పందం, రైతుల దుస్థితి, ఆర్థిక వ్యవస్థ వగైరా వాటిలో ఉన్నాయి. ప్రతిపక్షాల నైతికబలాన్ని దెబ్బతీయటానికి బిజెపి కండబలం రాజకీయాలు ప్రదర్శించినా, దాని మిత్రపక్షం కం వైరి శివసేన సభలో పాల్గొనకుండా బిజెపి గాలితీసింది.
అదలా ఉంచితే రాహుల్ ఆలింగనం ప్రభుత్వం ప్రతిపక్ష సంబంధాల్లో కొత్త దశ తెస్తుందా? మోడీ రాగా మహిళలకు కొత్త డీల్ ఇవ్వటం అన్నిటికన్నా ముఖ్యం. ఇండియా రేప్ కాపిటల్ అని, మహిళలకు సురక్షితం కాదని ముద్రలు పడుతున్న నేపథ్యంలో ఇది మరీ ముఖ్యం. ఇటీవల 150 సురక్షిత నగరాల సర్వేలో న్యూఢిల్లీ, ముంబయి అట్టడుగున వరుసగా 139, 126 స్థానాలు పొందాయి. ‘మేరా దేశ్ మహాన్, బ్రాండ్ ఇండియా అని మన రాజకీయవేత్తలు గొంతెత్తుతుండగా మన మహిళలు, యువతులు అరక్షిత వాతావరణంలో జీవించటం రోజురోజుకూ పెరుగుతున్నది. మహిళలను ఉద్ధరించాలని, వారికి “కొత్త డీల్‌” ఇవ్వాలని, ట్రిపుల్ తలాఖ్, నిఖా హలాలా రద్దు చేయాలని మోడీ, ఆతని ఎన్‌డిఎ సైనికులు భావిస్తే, మూలనపడిన 108వ రాజ్యాంగ సవరణ ప్రవేశపెట్టి ఆయన పైనుంచి మార్పు ఎందుకు తీసుకురాకూడదు? అది పార్లమెంటు, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు.
కాంగ్రెస్ నేత సోనియా గాంధి ఆదేశంపై 2010 మార్చిలో ఆ చరిత్రాత్మక బిల్లును రాజ్యసభ ఆమోదించటంతో “ఆమె” కథ ఆరంభమైంది. అయితే మహిళలకు సాధికారత కల్పించే దిశలో ‘పరివర్తనాత్మకమైన” బిల్లును మన పురుష దురహంకారులు కోల్డ్ స్టోరేజికి నెట్టారు. ఎందుకు మన ఎంపిలు ఈ బిల్లుకు అడ్డుపడుతున్నారు, దాని గూర్చి మాట్లాడటానికి సైతం ఎనిమిదేళ్లు ఎందుకు పట్టింది? అది నటనా, అత్యధిక మెజారిటీకి అర్థరహితమై, విద్యావంతులైన మహిళలకే ఇచ్చే రాయితీనా? అది మహిళా ఓటర్లను ప్రభావితం చేయటానికి ఉద్దేశించిందా? లేక దాన్ని ఆమోదించటం రాజకీయంగా సరైన చర్యనా?
కాంగ్రెస్, బిజెపి వేర్వేరు కత్తులు నూరుతున్నాయి. మాటలు మంచిగా ఉన్నా బిల్లును ఆమోదించటంలో చిత్తశుద్ధి లేదు. ఇంకా అనేక మంది వ్యతిరేకులున్నారు. మాయవతి నాయకత్వంలో ‘ఒబిసి బ్లాక్’ బిల్లును అడ్డుకుంటుందని వారి గట్టి నమ్మకం. అందువల్ల వారు బహిరంగంగా బిల్లును సమర్థిస్తారు. కాని ఎన్నటికీ చట్టం చేయరు. అది పట్టణ సంపన్న మహిళలను మాత్రమే చట్టసభల్లోకి తెస్తుందని రిజర్వేషన్ వ్యతిరేకుల వాదన. ఏ కోటా కూడా ఎవరికీ ఒకే తరగతికి ప్రాతినిధ్యం ఇవ్వలేదు. ఆ వాదన సమర్థనీయమే అనుకున్నా, తమ పట్టణ సహోదరిణులకు బదులు అఖిలేశ్ యాదవ్, తేజస్వీ యాదవ్ తమకు ప్రాతినిధ్యం వహించాలని భారత మహిళలు కోరుకుంటున్నారా?
చిత్రం చూడండి. ‘ఆమె క్యాబినెట్‌లో ఆమెయే ఏకైక పురుషుడు’ అని ఇందిరా గాంధికి మారుపేరు. అనేక మంది మహిళలు ముఖ్యమంత్రులుగా, వేలాది మంది పంచాయతీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. అయినా పార్లమెంటులో, అసెంబ్లీల్లో మహిళల ప్రాతినిధ్యం పెంచే ప్రయత్నాలన్నీ ఘోరంగా విఫలమైనాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ మహిళా ప్రాతినిధ్యం 10 శాతంలోపే. వరుస పార్లమెంటుల్లో మహిళల ప్రాతినిథ్యం 1962 మధ్యలో ఉంది. పార్లమెంటుకు మహిళలను పంపటంలో మనది ప్రపంచంలో దారుణమైన రికార్డు. 135 దేశాల్లో భారతదేశ స్థానం 105! ఈ అతి తక్కువ ప్రాతినిధ్యానికి పురుషాధిక్య సమాజంలో అనేక కారణాలు. 60వ దశకం సెక్స్ స్వేచ్ఛ తెచ్చింది, లోబాడీ దగ్ధం 70వ దశకానికి నిదర్శనమైంది, 80వ దశకం గర్భశ్రావ హక్కుతో కొంతమేరకు సమానత తెచ్చింది, 90వ దశకంలో హక్కులు, సమానత్వం స్థానంలోకి సాధికారీకరణ వచ్చింది.
వాస్తవానికి, మహిళల ప్రతిపత్తి అనేక శతాబ్దాలుగా పరివర్తన చెందుతూ ఉంది. ప్రతి తరం, ప్రతి దశాబ్దం లింగ వివక్షను రుపుమాపే దిశగా అడుగు ముందుకేస్తున్నది. అయినా వివక్ష కొనసాగుతూనే ఉంది. స్త్రీ పురుష దామాషా తక్కువ స్థాయిలో 0.93గా ఉండటంలో ఇది వ్యక్తమవుతున్నది. గర్భధారణలో బాలురకు ప్రాధాన్యత, ఆడశిశువుపట్ల నిర్లక్షం, భ్రూణ హత్య, అక్షరాస్యతలో లింగ వివక్ష పురుషాధిక్య సమాజంలో మహిళలను లోటు చేస్తున్నాయి. ఈ వివక్ష రాజకీయాల్లో, ప్రభుత్వంలో ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం కొరవడటానికి దారి తీస్తున్నది. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు మహిళలను రాజకీయ ప్రధాన స్రవంతిలోకి తేవటానికి సహాయకారి అవుతుంది. వారికి తగినంత రాజకీయ, ఆర్థిక అధికారం ఇస్తుందనేది ఫెమినిస్టుల వాదన. పార్టీ బాస్‌లు మహిళలకు తగు ప్రాధాన్యత ఇవ్వనందున రాజకీయాల్లో శక్తిమంతులైన మహిళల కొరత వాస్తవం. ప్రజా ప్రాతినిధ్య సంస్థల్లో మహిళల సమస్యలు అలక్షానికి గురవుతున్నాయి. అయితే ఈ బిల్లు శతాబ్దాలుగా పాతుకున్న అసమానతలను, మహిళలకు వ్యతిరేకంగా ఉన్న ముద్రను తొలగిస్తుందా! వివక్ష తొలగింపు అనేది చట్టాల ద్వారానే రాదు, సమాజంలో సహజసిద్ధ పరివర్తన రావాలి. పురుషులు, స్త్రీలను సమాన ప్రాతిపదికపై సమాజం ఆమోదించాలి. చట్టాలు దోహదకారి అవుతాయి.
మహిళలకు న్యూఢీల్ మొక్కుబడిగానే మిగులుతుందేమో చూడాలి. లింగ వివక్షలో 134 దేశాల్లో 114 స్థానంలో ఉన్న మన దేశం సమాన స్థాయి అవకాశాలు కల్పించటం అవసరం. సుపరిపాలన అనేది లింగ నిర్దుష్టం కాకూడదు. మహిళా బిల్లును ముందుకు నెట్టటం, సాధికారీకరణను ప్రోత్సహించటం, బిల్లు మేళ్లను వాస్తవం చేయటం ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధి ముందున్న పెద్ద సవాలు. కొత్త సమాజాన్ని మనం చూడగలమా? (ఇన్ఫా)