Home తాజా వార్తలు జోనల్ వ్యవస్థపై ప్రధాని సంతకం పెట్టారు…

జోనల్ వ్యవస్థపై ప్రధాని సంతకం పెట్టారు…

Great success of Telangana is MP Vinod

హైదరాబాద్: ఎపి విభజన చట్టంలోని ఇచ్చిన హామీలను కొన్నింటిని కేంద్ర పరిష్కరించిందని ఎంపి వినోద్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మిగిలిన పెండింగ్ అంశాలను కూడా త్వరితగతిన పరిశీలించాలని కేంద్రాన్ని కోరామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన కొన్నింటికి కేంద్ర హోంశాఖ ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు. హైకోర్టు విభజన న్యాయశాఖ పరిధిలో ఉంటుందని, హోంశాఖ నోడల్ వ్యవస్థగా ఉంటుంది కాబట్టి హైకోర్టు విభజనను వేగవంతం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరామన్నారు. ఎపి భవన్ విభజన తరువాత గదులను రెండు రాష్ట్రాలు సరిగా వినియోగించుకుంటున్నాయని వివరించారు.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి తీసుకొచ్చిన విషయాలను ఆర్థిక మంత్రికి కూడా కెసిఆర్ వివరించారని చెప్పారు. జోనల్ వ్యవస్థపై ప్రధాన మంత్రి సంతకం పెట్టారని స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలపై చర్చ జరుగుతున్నది వాస్తవమేనని, కానీ ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకోవాలన్నారు.