Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

‘ఛోగమ్’ దేశాధినేతలతో మోడీ చర్చలు

modi

లండన్: కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం(ఛోగమ్) 18  సందర్భంలో  ప్రధాని నరేంద్ర మోడీ   సీషెల్స్ అధ్యక్షుడు డానీ ఫ్యూర్, మారిషస్ ప్రధాని ప్రవీంద్ కుమార్ జుగ్‌నాథ్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ‘ప్రధాని మోడీ వాణిజ్యం, పెట్టుబడి, ద్వైపాక్షిక అంశాలపై వారితో చర్చలు జరిపారు’ అని విదేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ ట్వీట్ చేశారు.   మౌలికవసతుల అభివృద్ధి గురించి సీషెల్స్  భారత్‌తో చేసుకున్న అత్యున్నత వర్గీకృత ఒప్పందం ఎలా బయటికి పొక్కింది అన్న అంశంపై సీషెల్స్ విచారణకు ఆదేశించిన తర్వాత మోడీ, ఫ్యూర్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు ప్రాధాన్యతను సంతరించుకుంది. అతి పెద్ద తాబేళ్లకు ప్రపంచంలోనే పెను ఆవాసమైన, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన అల్‌దబ్రా అటాల్ వద్ద భారత్ చేపట్టే ఆ  మౌలికవసతుల ప్రాజెక్టుకు ఆమోదం తెలుపొద్దని సీషెల్స్‌లోని ప్రతిపక్షాలు నిర్ణయించుకునాయి. ఇదిలా ఉండగా మారిషస్ ప్రధాని జుగ్‌నాథ్‌తో స్నేహసంబంధాలను పటిష్టపరుచుకునే విధంగా మోడీ ద్వైపాక్షిక చర్చలు చేశారని,  వాణిజ్యం, పెట్టుబడి, సముద్ర సహకారం, ఇరు దేశాల మధ్య ప్రజా సంబంధాల గురించి చర్చించారని కూడా రవీశ్ కుమార్ చెప్పారు. ఉగాండ అధ్యక్షుడు యువరీ ముసెవెని, గాంబియా అధ్యక్షుడు అడామా బర్రో, ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనమీరామా, సెయింట్ లూసియా ప్రధాని అల్లెన్ ఛాస్టానెంట్, సోలమన్ ద్వీపాల ప్రధాని రిక్  హౌనెనిపులా, కిరిబాటి అధ్యక్షుడు తానేతీ మామావు, ఆంటిగ్వా బార్బుడా ప్రధాని గాస్టన్ బ్రౌన్, బంగ్లాదేశ్ ప్రధాని షేఖ్ హసీనాతో కూడా మోడీ చర్చలు జరిపారు. కాగా ఆస్ట్రేలియా ప్రధాని మాల్కమ్ టర్న్‌బుల్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ అనస్టాసియడస్, జమైకా ప్రధాని ఆండ్రూ మైఖేల్ హోల్నెస్, ట్రినిడాడ్ టొబాగో ప్రధాని డాక్టర్ కీత్ సి. రౌలీతో కూడా మోడీ చర్చలు జరుపనున్నారని భావిస్తున్నారు.  ఛోగమ్ రహస్య కార్యనిర్వాహక సమావేశం సందర్భంగా ప్రభుత్వాధినేతల రెండో ప్లీనరీ సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించాల్సి ఉంది.  ఛోగమ్ సమావేశం ప్రతి రెండు సంవత్సరాలకోసారి వేర్వేరు కామన్వెల్త్ దేశాల్లో జరుగుతుంది. అయితే తదుపరి ఛోగమ్ సదస్సు ఏ దేశంలో జరగనున్నదో ప్రస్తుత సమావేశం ముగింపులో ప్రకటించనున్నారు. కామన్వెల్త్ దేశాధినేతల సమావేశం ముగింపు తర్వాత మోడీ తిరిగి స్వదేశానికి వచ్చేప్పుడు జర్మనీ రాజధాని బెర్లిన్‌లో దిగి ఆ దేశ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్‌తో భేటీ కానున్నారు.

Comments

comments