Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ట్రంప్- మోడీ ముచ్చట్లు

Prime Minister Narendra Modi Meet with America President Donald Trump in Washington

వాషింగ్టన్ : భారత ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన జిఇఎస్ సదస్సు విజయవంతం కావడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్‌లో ఈనెల 28 నుంచి మూడు రోజుల పాటు జిఇఎస్ సదస్సు జరిగిన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు డొనాల్డ్ ట్రంప్ కూతురు, వైట్‌హౌస్ సలహాదారు ఇవాంక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇవాంక, మోడీలు ప్రత్యేకంగా భేటీ అయి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ఈ సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి సుమారు 1500 మంది పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

Modi Talks with Trump

Comments

comments