Home జాతీయ వార్తలు గుజరాత్‌లో మోడీ పర్యటన

గుజరాత్‌లో మోడీ పర్యటన

DWARAKA

అహ్మదాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ శనివారం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో జామ్‌నగర్‌కు చేరుకున్న మోడీకి ఆ రాష్ట్ర సిఎం విజయ్ రూపానీ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ద్వారకకు వెళ్లారు. అక్కడ ద్వారకాధీశుడికి మోడీ ప్రత్యేక పూజలు చేశారు. శనివారం మధ్యాహ్నం ఆయన ద్వారకలో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఓకా, బెట్ ద్వారక మధ్య నిర్మించనున్న బ్రిడ్జ్‌కు మోడీ శంకుస్థాపన చేస్తారు. మోడీ రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

 Modi tour in Gujarat