Home జాతీయ వార్తలు కలహాల ప్రపంచాన్ని కలిపేది యోగా!

కలహాల ప్రపంచాన్ని కలిపేది యోగా!

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా మోడీ ఆసనాలు 

50 వేల మందితో కలిసి యోగా ఆసనాలు  

ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం గురువారంనాడు ఘనంగా జరిగింది. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాలుపంచుకున్నారు. తెల్లవారుజామునే యోగా మ్యాట్‌లతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్థలాలకు చేరుకున్నారు. ప్రధాని మోడీ సహా కేంద్ర మంత్రులు, ఎపి సిఎం చంద్రబాబు తదితరులు ఆసనాలు వేశారు.

modi

డెహ్రాడూన్ : కలహాలతో కొట్టుమిట్టాడుతున్న ప్రపంచాన్ని కలిపి ఉంచడానికి యోగా శక్తివంతంగా పని చేస్తుందని ప్రపంచ యోగా దినోత్సవంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.డెహ్రాడూన్ లోని ఫారెస్ట్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో 50 వేల మందితో కలిసి ఆయన యోగా చేశారు. యోగా మన దేశ పురాతన, ఆచరణీయమైన ప్రక్రియ అని ఆయన తెలిపారు. బ్రిటీష్ కాలంలో నిర్మించిన బిల్డింగ్ ముందు ఆయన యోగా ప్రియులను ఉద్దేశించి ప్రసంగించారు. అనారోగ్యం నుంచి ఆరోగ్యానికి యోగా ఉపయోగపడుతుందని, ప్రజల్లో జవసత్వాలు నింపుతోందని ఆయన చెప్పారు. నేడు యోగా అనేది అతి పెద్ద ప్రజా ఆదరణ పొందినదిగా ప్రపంచం గుర్తిస్తోందని, మంచి ఆరోగ్యాన్ని, మనిషిగా మసలడానికి యోగా దోహదపడుతుందని, అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా శాంతిని స్థాపించడానికి కూడా యోగా ఉపకరిస్తుందని మోడీ చెప్పారు. డెహ్రాడూన్ నుంచి డబ్లిన్, షాంఘై నుంచి చికాగో, జకార్తా నుంచి జోహెన్‌బర్గ్, హిమాలయాలు లేదా సూర్యతాపానికి చిహ్నంగా నిలిచిన ఎడారుల వరకు యోగా కోట్లాది మందికి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తోందని ఆయన అన్నారు. సమాజంలో స్నేహపూరిత వాతావరణం నెలకొనడానికి, దేశంలో ఐక్యతని పెంపొందించడానికి యోగాని మించింది లేదని నరేంద్ర మోడీ అన్నారు. ఇది భారతీయ పురాతన కళే కాకుండా ఇది ప్రజలను, ప్రపంచాన్ని ఏకం చేసే మహత్తరమైన శక్తి అని చెప్పారు. అంతేకాకుండా ఇది ప్రపంచ ప్రజల మధ్య సోదర భావాన్ని పెంపొందిచడానికి సాధనంగా ఉపయోగపడుతుందని తెలిపారు.
మనలను విడదీసే శక్తులు పుంజుకుంటున్నప్పుడు యోగా మనలను కలపడానికి ఉపయోగపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సమాజంలో స్నేహాన్ని నెలకొల్పుతుంది.దేశ ఐక్యతకే కాకుండా ప్రపంచ ఏకతకు సోపానంగా పని చేస్తుంది. ప్రపంచంలో శాంతి స్థాపనలో కీలకంగా పని చేస్తుంది. మనం ఐక్యరాజ్య సమితిలో ప్రపంచ యోగా దినోత్సవం ప్రకటించాలని ప్రతిపాదించినప్పుడు అతి స్వల్పకాలంలోనే యుఎన్ అందుకు అంగీకరించి ప్రకటించింది. దీనికి అనేక దేశాలు మద్దతు పలికాయి. మన దేశం ప్రతిపాదనని అతి తక్కువ కాలంలోనే ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలిపింది. ఇప్పుడు ప్రపంచ ప్రజలు యోగాని నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు, దీన్ని గౌరవిస్తున్నారు. ఇది మన దేశానికి చెందిన పురాతన ప్రక్రియ ఐనా దాన్ని తమదిగానే భావిస్తూ ప్రపంచంలోని ప్రజలు దానిని అనుసరిస్తున్నారని నరేంద్ర మోడీ అన్నారు. ప్రపంచం గౌరవిస్తున్న యోగాని మనం గౌరవించుకోవాల్సిన అవసరముంది. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించుకోవాలి. ఈ ప్రక్రియలో మనమంతా పాలు పంచుకోవాలని నరేంద్ర యోడీ చెప్పారు. ఒక ప్రశాంతమైన, సృజనాత్మకమైన, అర్థవంతమైన జీవితం గడపడానికి యోగాని మించిన సాధనం లేదని ఆయన తెలిపారు. ప్రపంచ భవిష్యత్తుకు దారి చూపే కిరణంగా యోగా ఉపయోగపడుతుందని, యోగా ఒక అందమైన ప్రక్రియ అని, ఎందుకంటే ఇది పురాతనతో కూడిన ఆధునిక వ్యాయాయమని ఆయన చెప్పారు.యోగాని ఆచరించడాన్ని మనం గర్వంగా భావించాలి. విభజించే శక్తులను ఎదురించి అందరిని ఐక్యం చేసే సాధనం యోగా అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఆరోగ్యవంతమైన, సంతోషంగా, ప్రశాంతంగా జీవించడడానికి దారి తీసేది యోగా అని చెప్పారు.

yoga
ప్రపంచ యోగా దినోత్సవం రోజున యోగా గురు రాందేవ్ బాబా కొత్త గిన్నీస్ రికార్డు సృష్టించారు. గురువారంనాడు యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజస్థాన్‌లోని కోటాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయనతోపాటు రాజస్థాన్ సిఎం వసుంధర రాజే కూడా భాగస్వాములయ్యారు. సుమారు రెండు లక్షల మంది ఈ రికార్డులో పాలుపంచుకున్నారు. ఒకేసారి ఎక్కువ మంది యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ అద్భుత దృశ్యాన్ని ఇద్దరు గిన్నీస్ ప్రతినిధులు స్వయంగా చూశారు. అనంతరం రాందేవ్ బాబా, సిఎం వసుంధరకు రికార్డు పత్రాలను అందజేశారు. ఉదయం ఆరున్నర నుంచి 7గంటల వరకు ఇది కొనసాగింది. కెమెరాలు, డ్రోన్‌ల సాయంతో లెక్కగట్టగా 1.50 లక్షల మంది ఇందులో పాలుపంచుకున్నట్టు తేల్చారు. 2017 మైసూర్‌లో జరిగిన యోగా ఈవెంట్‌లో 55,524ల మంది పాల్గొనడమే మొన్నటి వరకు రికార్డుగా ఉండేది.

నేతల యోగాసనాలు

leaders-yoga