Home జాతీయ వార్తలు ఆగస్టు 7న మోడీ రాక

ఆగస్టు 7న మోడీ రాక

modiహైదరాబాద్ : ప్రధాని నరేంద్రమోడీ వచ్చే నెల 7న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆగస్టు 7న మిషన్ భగీరథతో పాటు పలు అభివృద్ధి పనులను ఆయన గజ్వేల్‌లో ప్రారంభిస్తారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం నుంచి తెలంగాణ సర్కారుకు సమాచారం అందింది. తెలంగాణ ఏర్పడిన తరువాత మోడీ రావడం ఇదే తొలిసారి, ప్రధాని పర్యటనపై ఆది నుంచి అనుమానాలు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం పిలిచినా, పిలవకున్నా రాష్ట్రానికి రావాలని బిజెపి నేతలు ప్రధాని మోడీని పలుమార్లు కోరారు. ఇటీవల సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటనలో మోడీని కలిసినప్పుడు తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథను ప్రారంభించాలని కోరారు. దీంతో ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఖరారైంది.