Home జాతీయ వార్తలు మోడీ బయోపిక్‌… అమిత్‌ షా లుక్‌…!

మోడీ బయోపిక్‌… అమిత్‌ షా లుక్‌…!

Modi's Biopicముంబయి : ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్‌ తెరకెక్కుతోంది. ఈ బయోపిక్‌కు ‘పిఎం నరేంద్ర మోడీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే.  మోడీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో బిజెపి  అధ్యక్షుడు అమిత్‌ షా పాత్రకు సంబంధించిన లుక్‌ను చిత్రబృందం బుధవారం విడుదల చేసింది. అమిత్ షా పాత్రలో మనోజ్ ‌జోషి నటిస్తున్నారు. అమిత్‌ షా పాత్రలో  మనోజ్ జోషి ఒదిగిపోయారు. ఈ సినిమాకు ఒమంగ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జనవరిలో 23 భాషల్లో డిజైన్‌ చేసిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మహారాష్ట్ర సిఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ విడుదల చేశారు. వివేక్‌ తండ్రి సురేశ్‌ ఒబెరాయ్‌, సందీప్‌ సింగ్‌ సంయుక్తంగా ఈ  సినిమాను నిర్మిస్తున్నారు. పోస్టర్‌పై ‘దేశ భక్తే నా శక్తి’ అన్న క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది.

Modi’s Biopic … Amit Shah Look