Home జాతీయ వార్తలు విమాన ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి

విమాన ప్రమాదంపై మోడీ దిగ్భ్రాంతి

Modiఢిల్లీ : ఢిల్లీలో మంగళవారం జరిగిన బిఎస్‌ఎఫ్ విమాన ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం బాధాకరమని ఆయన ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఢిల్లీలోని ద్వారకా ప్రాంతంలో బిఎస్‌ఎఫ్ సూపర్‌కింగ్ విమానం టేకాఫ్ అవుతుండగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పది మంది బిఎస్‌ఎఫ్ సిబ్బంది చనిపోయిన విషయం తెలిసిందే. సూపర్‌కింగ్ సంస్థకు చెందిన బిఎస్‌ఎఫ్ విమానం మంగళవారం ఉదయం పది గంటల సమయంలో ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి సాంకేతిక నిపుణులతో రాంచీ వెళుతుండగాద గోడను ఢీకొని కూలిపోయింది.