Home ఆఫ్ బీట్ వీడియోలు నోటికి అందివచ్చిన కూడు కోసం కొండచిలువ సాహాసం!(వీడియో)

నోటికి అందివచ్చిన కూడు కోసం కొండచిలువ సాహాసం!(వీడియో)

Python Snags Birdఓ కొండచిలువ నోటికాడ వచ్చిన కూడు ఎక్కడ చేజారిపోతుందోనని.. దాన్ని ఎలాగైనా స్వాహా చేయాలని పడిన కష్టం ఉంది చూడండి మాటల్లో చెప్పలేనిది. ఓ పక్షిని నోటకరచుకున్న కొండచిలువ దాన్ని మింగడానికి మాములుగా తన్లడాలేదు. అది ఓ టివి యాంటీనాపై వేలాడుతూ ఆ పైథాన్ చేసిన సాహాసానికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. యాంటీనాపై వేలాడుతూ పక్షిని మింగడానికి కొండచిలువ పడిన కష్టాన్ని ఎదురింటిలో ఉండే ఓ మహిళ తన మొబైల్ ద్వారా వీడియో తీసి అంతర్జాలంలో పెట్టింది. అంతే.. అది కాస్తా వైరల్ గా మారింది. ఈ సంఘటన ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్ లో జరిగింది. క్యాథీ గాల్ అనే మహిళ ఈ వీడియోను తీసి పోస్టు చేసింది.

Moment a python devours bird on a rooftop in Australia