Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

మొనాకో

Monaco

*పర్యాటకులను ఆకర్షించే యూరోప్‌లోని అతి చిన్న దేశం మొనాకో. పర్యాటకులకు ఒక ఆటస్థలం లాటిది. ముఖ్యంగా సంపన్నులకు ఇది స్వర్గం లాటిది.
*ఈ దేశానికి మూడువైపులా ఫ్రాన్స్ ఉంటుంది. అతి చిన్న దేశం అయినా అత్యధికంగా జనసాంద్రత ఉన్న దేశం ఇది. దేశ జనాభా 35,986. ఫ్రాన్స్‌కి, ఇటలీకి మధ్యలో ఉంటుంది.
* విస్తీర్ణం రెండు చదరపు కిలోమీటర్లే.
*ఇక్కడి ప్రజలు దీర్ఘాయువులు. తొంభై ఏళ్ల పైనే జీవిస్తారు.
*నిరుద్యోగం అన్న మాటే లేదు. ఫ్రాన్స్, ఇటలీల నుంచి రోజూ ఇక్కడికి నలభై వేలమంది వచ్చి పని చేసి వెళ్తుంటారు. మొనాకో ఆదాయపు పన్ను లేదు.
మొనాకో1914 లో కొనుగొనబడిన దేశం . రాజరికపు దేశం ఇది. ఇక్కడి కరెన్సీ యూరోలు.
*1297 నుంచి రాజరికం కొనసాగుతోంది. పిన్స్ రెయినియర్ చనిపోయిన తర్వాత అతని కొడుకు రాజు ప్రిన్స్ ఆల్బర్ట్-2 32వ రాజుగా సింహాసనం అధిష్టించాడు. అతనే ఇప్పుడు మొనాకో రాజు.
*పర్యాటకులను మొనాకో అధికంగా ఆకర్షించడానికి కారణం అక్కడి విందు వినోద సాధనాలు. జూదగృహాలు, నైట్‌క్లబ్‌లు విస్తారంగా ఉంటాయి. మోంటీకార్లో అనే ప్రదేశం వాటికి బాగా ప్రఖ్యాతి.
*మోంటీకార్లో పేరు ఇటాలియన్ భాష నుంచి వచ్చింది. మూడవ ఛార్లెస్‌కు గుర్తుగా ఆ నగరానికి ఆ పేరు పెట్టారు. మొనాకో దేశస్థులను మొనాకన్స్ అంటారు.
* రౌలెట్, స్టడ్ పోకర్, బ్లాక్‌జాక్, క్రాప్స్, బకారట్ లాటి జూదాలు అన్ని కేసినోలలో ఉంటాయి. *మొనాకన్స్‌కి మాత్రం ఈ కేసినోలలో ప్రవేశం ఉండదు.
* రేసింగ్ కార్లు మొనాకో ముఖ్య ఆకర్షణ. మోంటీకార్లోలో గంటకి 360 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే కార్లు రేసుల్లో పాల్గొంటాయి.
* ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి ఈ రేసుల్లో పాల్గొంటారు. 1864 లో నిర్మించిన హోటల్ డి పేరిస్‌లో మొత్తం 106 గదులుంటాయి.
*ఈ హోటల్ కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది.
*ఏడాదికి ఒకటిన్నర మిలియన్ల సందర్శకులు మొనాకోకి వస్తారు. మోంటెకార్లో నగరం ప్రపంచ ఖ్యాతి తెచ్చుకుంది.
*ఆమె కొడుకే ఇప్పటి రాజు ఆల్బర్ట్-2.
* అత్యంత పురాతనమైన ఆటోమొబైల్స్ ఉన్న మ్యూజియం ఇక్కడ ఉంది.

*మే నుంచి అక్టోబర్ వరకు ఇక్కడ టూరిస్ట్ సీజన్. ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నుంచి రోడ్డు మార్గంలో అరగంటలో చేరుకోవచ్చు. యూరోప్‌లోని అన్ని ముఖ్య నగరాల నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉంటాయి. *1961 నుంచి మోంటికార్లో టెలివిజన్ ఫెస్టివల్ ప్రతి ఏటా జరుగుతోంది.

Comments

comments