Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సొమ్ము ఒకరిది…సోకు ఇంకొకరిది

sit

* సోలార్ కంపెనీ ఏర్పాటులో రైతులను నట్టేట ముంచిన దళారులు..?
* ఎకరాకు రైతుకిచ్చింది రూ.లక్షన్నర.. మధ్యవర్తులు సంపాదించింది రూ.కోట్లలో..
* బాధితులతో కలిసి సోలార్ కంపెనీ ఎదుట ధర్నా చేపట్టిన ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి..

మన తెలంగాణ/పెద్దమందడి : మండల పరిధిలోని అల్వాల గ్రామ శివారులో ఏర్పాటు చేస్తున్న సోలార్ కంపెనీ నిర్మాణంలో రైతులను నట్టేట ముంచి దళారులు కోట్లకు పడగెత్తిన ఉదంతం ఆల స్యంగా వెలుగు చూసింది. దీంతో బాధితులు లబోదిబోమంటూ తమకు న్యాయం చేయాలని సోలార్ కంపెనీ ముందు గురువారం ఆందోళన చేపట్టారు. రైతులు చేస్తున్న ఆందోళనకు వనపర్తి ఎంఎల్ ఎ డా.జి.చిన్నారెడ్డి, కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ బీరం హర్షవర్దన్‌రెడ్డిలు మద్దతు ప్రకటించి రైతులతో కలిసి ఆందోళనలో పాల్గొన్నారు. మండలంలోని మద్దిగట్ల ,పెద్దమందడి, అల్వాల,అమ్మపల్లి గ్రామాల్లోని శివారులో గల 280 ఎకరాల్లో సోలార్ కంపెనీ ఏర్పాటు చేస్తు న్నారు. కంపెనీ కొంత మంది మధ్యవర్తులకు ఎకరాకు రూ.6.25లక్షలకు ఒప్పందం కుదుర్చు కొంది. కాని కొంత మంది మధ్యదళారులు రైతులకు ఎకరాకు  రూ. 50వేలు మొదలుకొని రూ.3 లక్షల వరకు మాత్రమే చెల్లించి మిగతా డబ్బులు కాజేశారు. తమను మోసం చేసి తమ భూములను కొనుగోలు చేసిన వారు తమకు ఇవ్వాల్సినంత డబ్బులు ఇవ్వకుండా అక్రమంగా వెనకేసుకున్నా రని సోలార్ కంపెనీ నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి ఉపాధి అవకాశం కల్పించకుండా అల్వాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఎవరి పేరు సూచిస్తే వారికి మాత్రమే కంపెనీలో ఉపాధి కల్పి స్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. శాశ్వతంగా తమ భూములను కోల్పోయి కుటుంబం వీధిన పడగా తమకు వచ్చింది కేవలం రూ. 50వేలు మొదలుకొని రూ.లక్షన్నర, మూడు లక్షల రూపాయల వరకు రాగా మధ్య దళారులు బాగుపడ్డారని తమకు న్యాయం చేయాలని వారు గురువారం ఆందోళ నకు దిగారు. రైతుల ఆందోళనను తెలుసుకున్న ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి రైతులతో కలిసి దాదాపు రెండు గంటలకు పైగా ఎండలో కూర్చొని ధర్నా చేపట్టారు.
25 తేదీ వరకు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తాం:ఎంఎల్‌ఎ చిన్నారెడ్డి
ఈనెల 25 తేదీ వరకు రైతులకు న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృ తం చేస్తామని ఎంఎల్‌ఎ డా.జి.చిన్నారెడ్డి తెలిపారు. కంపెనీ ప్రతినిధి శ్రీ నివాస్‌రెడ్డితో ఎంఎల్‌ఎ మాట్లాడుతూ కంపెనీకి భూములు కొనుగోలు చేసిన బాలకిష్టారెడ్డిని 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు పిలి పించి న్యాయం చేయాలని లేని పక్షంలో కంపెనీ పనులను అడ్డుకోవా ల్సి వస్తుందని, 25వ తేదీ వరకు సోలార్ కంపెనీలో ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆయన సూచించారు. ఆందోళనలో నాగర్‌కర్నూల్ పార్ల మెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి, పెద్దమందడి మాజి జడ్పిటిసి వెంకటస్వామి, నాయకులు బుచ్చిలింగం, రైతులు చిన్నయ్య, కురుమూర్తి, రాజు, లక్ష్మీకాంత్ రెడ్డి, భాస్కర్, తదితరులు ఉన్నారు.

Comments

comments