Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

‘వైద్యోయమధర్మరాజా హా’

Monitoring of the duties of medical staff

మన తెలంగాణ/ వరంగల్ అర్బన్ జిల్లా ప్రతినిధి : ‘వైద్యోనారా యణ హరి అనే నానుడి కాస్తా వైద్యోయమధర్మ  రాజహరి’ అన్నట్లుగా పరిస్థితి మారింది. క్షేత్రస్థాయిలో వైద్య ఉద్యోగుల విధుల నిర్వహణ పట్ల పర్యవేక్షణ కరువైంది. దీంతో ఆయా పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగుల వైఖరి ఆ డిందే ఆటగా పాడిందే పాటగా మారింది. నగరంలోనే నివాసాలుండటం, పిహెచ్‌సిలకు చుట్టపు చూపుగా వెళ్లడం అలవాటుగా మారిందనే అరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఏజెన్సీ పిహెచ్‌సీలలో విధులు నిర్వహించే ఉద్యోగులు, సీనియర్, జూ నియర్ అసిస్టెంట్లు ఎక్కడున్నా విధులలోనే ఉన్నట్లుగా రికార్డులలో చూపడం పైస్థాయి అధికారులను మెనేజ్ చేయ డం లో దిట్ట. వారిని కదిలించే అధికారులేలేరంటే అతిశయోశక్తి  కాదు. దీంతో పల్లెలలో వైద్యసేవలు పేకే తప్ప ఆచరణలో అంతగా కనిపించడం లేదని, పర్యవేక్షణ లేకపోవడంతో పిహెచ్‌సిలలో వైద్యసేవలతో పాటు, విధుల నిర్వహణ పట్ల నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సుదూర ప్రాంతాలలో ఉండే పిహెచ్‌సీలకు ఉద్యోగులు చుట్టపు చూపుగానే వెళ్లడం, వెళ్లినప్పుడు రోజువారిగా విధులు నిర్వహించినట్లుగా రికార్డులు రాయడం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని వైద్యారోగ్యశాఖలోనే గుసగుసలు వినిపించడం గమనార్హం. అయితే పిహెచ్‌సి స్థాయిలో వైద్య ఉద్యోగుల విధుల నిర్వహణ పట్ల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టారాజ్యం సాగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పట్నాం ను వీడి పల్లె ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలలోని పిహెచ్‌సిలకు పయణమవడం ఉద్యోగులు అంతగా దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆరోపణలకనుగుణంగానే ఆయా ప్రాంతాలలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగుల పని తీరు ఉండటం గమనార్హం. ఇక ఏజెన్సీ ప్రాంతాలలోని పిహెచ్‌సిలలోని సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, సూపర్‌వైజర్ల పని తీరు ఆరోపణలకు అద్దంపడుతుందనడంలో సందేహం లేదు. పై స్థాయి అధికారులతో ఆశీస్సులతో ఏజెన్సీ ప్రాంతాలలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరించడం గమనార్హం. ఈ నేపథ్యంలో వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యారోగ్యశాఖ తగు చర్యలు చేపట్టకుంటే పల్లెలు పడకేయక తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పిహెచ్‌సిలలోని ఉద్యోగుల తీరు పలు అనుమానాలకు రేకెత్తుతున్నాయని పలువురు భావిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్షం గా వ్యవహరించే ఉద్యోగుల పై, ఏజెన్సీ ప్రాంతాలలోని పిహెచ్‌సిలలో విధులు నిర్వహించే ఉద్యోగుల పని తీరు పట్ల దృష్టి సారించాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం పిహెచ్‌సి స్థాయిలో వైద్య సేవలను మెరుగుపరుచాలని, ఉద్యోగులు సక్రమంగా విధులు నిర్వహించేలా తగు చర్యలు చేపట్టాలని, క్షేత్రస్థాయిలో వైద్యశిభిరాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

comments