Home వార్తలు సెప్టెంబర్ చివరిలో వర్షాకాల అసెంబ్లీ

సెప్టెంబర్ చివరిలో వర్షాకాల అసెంబ్లీ

APASSEMBLYహైదరాబాద్: శాసనసభ వర్షాకాల సమావేశాలను వచ్చే నెల చివరి వారం నుండి కొనసాగించాలని శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ (బిఎసి) నిర్ణయిం చింది. ప్రస్తుత సమావేశాలను కొనసాగించాలని, కనీసం 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహిం చాలని ప్రతిపక్షాలు బిఎసిలో పట్టుబడడంతో ప్రభుత్వం ఈ మేరకు అంగీకరించింది. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుకు మద్దతు తెలప డానికి మంగళవారం ప్రత్యేకంగా సమావేశమైన శాసనసభ, శాసనమండలి అదే రోజు సా యం త్రం నిరవధింగా వాయిదా పడ్డాయి. జిఎస్‌టి బిల్లును సమర్థిస్తూ ఏకగ్రీవం గా తీర్మానం చేసిన అనంతరం ఉభయ సభలు మరో మూడు బిల్లులను ఆమోదించాయి. టీ విరామంలో స్పీకర్ ఎస్.మధుసూధనాచారి అధ్యక్షతన జరిగిన బిఎసి సమావేశంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీశ్ రావు, కాంగ్రెస్ తరుపున మల్లు భట్టివిక్రమార్క, బిజెఎల్‌పి నేత జి.కిషన్‌రెడ్డి, టిడిపి సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, సిపిఐ(ఎం) సభ్యులు సున్నం రాజ య్య, ఎంఐఎం సభ్యులు మౌజం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. విశస్వ నీయ సమాచారం ప్రకారం బిఎసి సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు ప్రస్తుత శాసనసభ సమావేశాలను మరో పదిహేను రోజుల కొనసాగించాలని పట్టు బట్టారు. అయితే వచ్చే నెల 5 నుండి వినాయకచవితి , ఆ తరువాత 15న వినాయక నిమజ్జనం ఉన్నందున హైదరాబాద్‌లోనే 22వేల మంది పోలీసు బందోబస్తు అవసరమని, కాబట్టి ప్రస్తుత సమావేశాలను కొనసాగించడం సా ధ్యం కాదని సిఎం కెసిఆర్ చెప్పినట్లు సమాచారాం. దీనికి విపక్ష సభ్యులు స్పందిస్తూ నిమజ్జనం తరువాత వచ్చే నెల 20 నుండి సమావేశాలు కొన సాగించాలని, పది పని దినాలు నిర్వహించాలని కోరాయి. దీనికి అభ్యంత రం లేదని, అయితే కచ్చితంగా సెప్టెంబర్ 20 నుండి నిర్వహిస్తామని చెప్ప లేమని, ఆ సమయంలో ఇతర కార్యక్రమాలను కూడా చూసుకోవాల్సి ఉంద ని, కాబట్టి చివరి వారంలో కచ్చితంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు తెలి సింది. అలాగే పది పని దినాలు సమావేశం నిర్వహించేందుకు బిఎసిలో అంగీకారం జరిగింది. అలాగే ఖమ్మం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని పాలేరు అవతల సాగునీటికి ఇబ్బంది ఉన్నదని, మల్లు భట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్య చేసిన విజ్ఞప్తిపై సిఎం సానుకూలంగా స్పందించారు. అక్కడికి నాగార్జునసాగర్ కాలువ ద్వారా నీటిని విడుదల చేసే అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఇదిలాఉండగా శాసనమండలి ఛైర్మన్ కె.స్వామిగౌడ్ అధ్య క్షతన జరిగిన మండలి బిఎసి సమావేశంలో వచ్చే నెలలో పది నుండి పన్నెండు రోజుల వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
సెప్టెంబర్ చివరి వారంలో అసెంబ్లీ: హరీశ్‌రావు
సెప్టెంబర్ చివరి వారంలో రాష్ట్ర శాసనసభ వర్షాకాల సమావేశాలను నిర్వ హిస్తామని, కనీసం 10 నుంచి 12 రోజుల పని దినాలు సభను నిర్వహి స్తా మని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి. హరీష్‌రావు వెల్లడించారు. మంగళవారం శాసనమండలి నిరవధిక వాయిదా అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రి ఐ.ఇంద్రకరణ్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడా రు. శాసనసభలో చర్చించాల్సిన అంశాలు అనేకం ఉన్నాయని, వాటికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం తప్పించుకుంటుందంటూ ప్రతిపక్షాలు, ప్రధా నంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదన్నారు. సభలో ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్దమని, తప్పించుకునే తత్వం ప్రభుత్వానికి కాదన్నారు.