Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

జల కళ

రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలు, కడెం రిజర్వాయర్‌లోకి భారీగా వరదనీరు, మంచిర్యాల, నిర్మల్ ప్రధాన రహదారిపై కొట్టుకుపోయిన వంతెనలు, భద్రాద్రి  కొత్తగూడెం జిల్లాలో, మెట్‌పల్లిలో కుండపోత

waterజిల్లాల నుంచి మన తెలంగాణ ప్రతినిధులు : రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన వర్షా లకు వాగులు, వంకల్లోకి నీరు చేరింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పశ్చిమ ప్రాం తంలో శనివారం రాత్రి కురిసిన వర్షానికి తాత్కాలిక వంతెనలు కొట్టుకు పోయాయి. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గత ఐదేళ్లలో తొలిసారిగా జూన్ మాసంలోనే కడెం రిజర్వాయర్‌లోకి నీరు వస్తోంది. ఆదివారం ఉదయం 4 వేల క్యూ సెక్కుల చొప్పున నీరు రాగా, 700 అడుగులకు గాను 682 అడుగుల వరకు నీటిమట్టం పెరిగింది. మరో 8 అడుగుల నీటి మట్టం పెరిగితే కడెం గేట్లు తెరుస్తారు. ఆదిలాబాద్‌లో రహదారులు భారీగా కోతకు గురయ్యాయి. మంచిర్యాల, నిర్మల్ ప్రధాన రహదారిపై వంతెనలు కొట్టుకుపోయాయి. ఫలితంగా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల  ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. సోమవారం మధ్యా హ్నం కల్లా తాత్కాలిక ఏర్పాట్లు చేస్తామని అధికారులు చెప్పారు. మెట్‌పల్లిలో భారీ వర్షంతో మార్కెట్, కళానగర్, చైతన్యనగర్, రాంనగర్, గాజులపేట, బీడికాలనీ, దీన్‌దయాల్‌నగర్, బంటుపేట, బోయవాడలోని లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరింది. పంట పొలాలన్నీ వర్షంతో నిండాయి. రైతులు వ్యవసాయ పనులపై దృష్టిపెట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం కుండపోత కురిసింది. గణపురం మండలంలోని కర్కపల్లిలో దుక్కిటెద్దు విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటున్నారు. వర్షం ఇలాగే కొనసాగితే వాగులు, వంకలు, కుంటలు నిండడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్న విశ్వాసంతో రైతులు విత్తనాల వేటలో పడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరు వర్షం కురిసింది.  సంగారెడ్డి మండల కేంద్రంలో రాత్రి అరగంట పాటు వర్షం కురిసింది. నాల్సాబ్‌గడ్డ జలమయమైంది.

Comments

comments