Home మెదక్ నెల పాటు జనాభా సర్వే : జెసి

నెల పాటు జనాభా సర్వే : జెసి

JCసంగారెడ్డి: జిల్లాలో ఈ నెల 16 నుంచి డిసెంబర్ 15 వరకు నెల రోజుల పాటు జాతీయ జనాభా రిజిస్టర్ డేటా బేస్‌ను పకడ్బందీగా తయారు చేయాలని జెసి వెంకట్రామ్‌రెడ్డి అధికారులకు సూచించా రు. కేంద్ర ప్రభుత్వం దేశ పౌరుల జా తీయ రిజిస్టర్‌ను తయారు చేసేందుకు తొలిమె ట్టుగా దేశంలోని సాధారణ నివాసితుల జాతీ య జనాభా రిజిస్టర్‌ను తయారు చేయాలని తలపెట్టి న నేపథ్యంలో శనివారం కలెక్టరేట్‌లో అధికారు లకు జిల్లా స్థాయి అవగాహన కా ర్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఎన్యూమ రేటర్లకు మండల స్థాయిలో శిక్షణని చ్చేందుకు లీడర్‌షిప్ లక్షణా లున్న ఉద్యోగులను ముఖ్యంగా టీచర్లనే ఎంపిక చేసి, వారితో శిక్షణనిప్పించాలన్నారు. విఆర్‌ఓలను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని, ఆ ధార్ నంబర్‌ను డేటాబేస్‌తో అనుసంధానం చే యాలని, ఆధార్ కోసం వత్తిడి చేయరాదన్నారు. ఏవైనా తప్పులుంటే వాటిని కుటుంబాలకు చూ యించి ప్రజలను నిరుత్సాహ పర్చవద్దన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఎన్యూమరేటర్లుగా నియమించాలన్నారు. ప్లానింగ్ శాఖ ఎడి చంద్ర కళ డేటాబేస్ గురించి అవగాహన కల్పించారు. జిల్లా సెన్సెస్ అదికారి రఘురామన్, ఆర్డీఓలు మ ధుకర్‌రెడ్డి, ముత్యంరెడ్డి, నగేష్, మున్సిపల్ కమి షనర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.