Home వార్తలు బ్యాంకుల మొండి బకాయిలు తగ్గుముఖం

బ్యాంకుల మొండి బకాయిలు తగ్గుముఖం

Moody'sన్యూఢిల్లీ: దేశీయ బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు తగ్గుముఖం పడుతున్నాయని, ఆస్తుల నాణ్యత మెరుగవుతోందని గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ ఇన్వెస్టర్ సర్వీసెస్ పేర్కొంది. గత 12-18నెలలుగా ఈ రంగం స్థిరంగా ఉందని సం స్థ నివేదికలో వెల్లడించింది. గత కొన్నేళ్లతో పోల్చు కుంటే కొత్తగా మొండిబకాయిలు లేవని, భారత బ్యాంకింగ్ వ్యవస్థ ఆస్తుల విలువ పడిపోయే అ ధ్వాన్న పరిస్థితి నుంచి బయటపడుతోందని, సం వత్సర కాలంగా స్థిరంగా వృద్ధిని సాధిస్తోందని మూడీస్ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే మూడే ళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనం అవసరాలు తీరడంతో పాటు పరిమితంగా క్యాపి టల్ మార్కెట్లలోకి వెళ్లాలని సంస్థ పేర్కొంది. ప్రైవే టు బ్యాంకులు క్యాపిటల్ మార్కెట్ల నుంచి పూర్తి పెట్టుబడి పొంది, మంచి లాభాలను పొందనున్నా యని మూడీస్ వైస్ ప్రెసిడెంట్ వాల్దమని అన్నా రు. దేశీయ బ్యాంకులకు ఆపరేటింగ్ వాతావర ణం స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు దారితీస్తుంది. 2015లో జిడిపి వృద్ధి రేటు 7.3 శాతంతో పోలిస్తే వచ్చే రెండేళ్లలో 7.4 శాతం ఉండే అవకాశముంద ని మూడీస్ అంచనా వేస్తోంది. సానుకూల రుతు పవనాలు, కొనసాగుతున్న పెట్టుబడులు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో కొనసాగుతున్న వృద్ధి వంటి అంశాలు వృద్ధి రేటుకు దోహదం చేయనున్నాయి.