Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పాయింట్ల విధానంతో పెరిగిన దరఖాస్తులు

ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్న పోలీసులు, 12 పాయింట్లు దాటితే లైసెన్స్ రద్దు
దరఖాస్తుల సంఖ్య పెరిగినా ట్రాక్‌లకు సంఖ్య పెరగని వైనం

           Traffic-Rules

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఆర్‌టిఎ, ట్రాఫిక్ అధికారులు ప్రవేశ పెట్టిన పాయింట్ల విధానంతో నగరంలోని ఆర్‌టిఎ కార్యాలయాల్లో డ్రైవింగ్ లైసెన్స్‌లు దరఖాస్తుల సంఖ్య పెరిగింది. గతంలో రోజుకు  20 నుం చి 30 వరకు ఉన్న వీటి సంఖ్య అగస్టు ఒకటి నుంచి అధికారులు ప్రవేశ పెట్టిన పాయింట్ల విధానంతో వీటి సంఖ్య రోజుకు 80 నుంచి 95 వరకు పెరిగింది.  సిగ్నల్ పాయిటింగ్‌కు రెండు పాయింట్లు, హెల్మెట్ పెట్టుకోకపోతే ఒక పాయింట్ రెండు సంవత్సరాల్లో 12 పాయింట్లు దాటితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు. వంటి పద్దతులు గత నెల నుంచి నగరంలో కొత్తగా అమల్లోకి వచ్చిన విధానం. దీంతో ట్రాఫిక్ పో లీసులు ఎక్కడికక్కడే తనిఖీలు నిర్వహించడంతో వాహనదారులు ఒక్కసారిగా బెంబేలు ఎత్తిపోతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లే కుండా వాహనం నడిపితే  సదరు వా హనాన్ని అధికారులు జప్తు చేస్తున్నారు.

దీంతో ఆయా కార్యాలయాలన్నీ ఎన్నడూలేని విధంగా దరఖాస్తు దారులతో కిక్కిరిసి పోతున్నాయి. గతంలో మూడు, నాలుగు రోజులకు ఇచ్చే లైసెన్సులు జారీకి ఇప్పుడు  15 నుంచి 20 రోజులు సమయం పడుతోంది. వీటి పరిస్థితి ఇలా ఉంటే డై వింగ్ లైసెన్స్‌ల జారీ అనంతరం చేసే టెస్ట్ డ్రైవ్ ట్రా క్‌ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. జిహెచ్‌ఎంపి పరిధిలో నాగోలు కొండాపూర్, మేడ్చెల్, ఇబ్రహీంపట్నంలోనే ట్రాక్‌లు ఉన్నా యి. ఇతర ఆర్‌టిఎ కార్యాలయాల్లో  ట్రాక్‌లు అందుబాటులో లేక పోవడంతో టెస్ట్ డ్రైవ్‌కు వచ్చిన వారు అనేక ఇబ్బందులు పడుతున్నా రు. తాము కార్యాలయాలకు సెలవు పెట్టి ఇంత దూ రం వస్తే ఇక్కడ టెస్ట్ డ్రైవ్‌కు కోసం వచ్చే వారి సంఖ్య అధికంగా ఉండంటంతో తాము వెనుదిరిగి పోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఖైరతాబాద్, టోలి చౌకి. అత్తాపూర్, తిరుమలగిరి, మలక్‌పేట, బహూదర్‌పుర, ఉప్పల్  తదితర కార్యాలయాల నుంచి వచ్చే దరఖాస్తు దారులందరినీ టెస్ట్ ట్రాక్‌ల కోసం కొండాపూర్, నాగోలు, ట్రాక్‌లకు పంపిస్తున్నారు. వనస్థలిపురం నుంచి వచ్చే దరఖాస్తుదారులు ఇబ్రహీంపట్నం వెళ్లాల్సి వస్తోంది.

ఈ విధంగా ఎక్కడ చూసినా వందలాది దరఖాస్తు దారులతో ట్రాక్‌లన్నీ రద్దీగా కనిపిసున్నాయి. దరఖాస్తుల సంఖ్య 20 నుంచి 30 శాతం వరకు పెరిగిందని రోజుకు మూడు వేలకు పైగా లైసెన్స్‌లు జారీ చేయాల్సొస్తోందని అధికారులు చెబుతున్నారు. జిహెచ్‌ఎంసి పరిధిలో జిల్లా కేంద్రాల్లో కొత్త ట్రాక్‌ల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించినా ప్రభుత్వం నుంచి స్పంద న రావడం లేదని అధికారులు చెబుతున్నారు. ము ఖ్యంగా స్థలాలు అందుబాటులో లేక పోవడంతో కొత్తట్రాక్‌ల ఏర్పాటు సాధ్యం కావడదం లేదంటున్నారు. మెహదీపట్నం, సికింద్రాబాద్, మియాపూర్, మలక్‌పేట ప్రాంతాల్లో కొత్త ట్రాక్‌లు స్థలాలు కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపినట్లు తెలిపారు. నూతనంగా వచ్చిన పాయింట్ల విధానంతో దరఖాస్తుల సంఖ్య పెరిగినా ట్రాక్‌లకు సంఖ్య పెరగడం లేదని వారు వాపోతున్నారు.

Comments

comments