Search
Sunday 23 September 2018
  • :
  • :

అవినీతికి కేరాఫ్‌గా అలంపూర్ చెక్‌పోస్ట్

ఇక్కడ పోస్టింగ్‌కు లక్షల్లో మామూళ్లు ?
ప్రవేట్ వ్యక్తులతో అక్రమ వసూళ్లు
అందరికీ వాటాలు

             Check-Post

మహబూబ్‌నగర్ ప్రతినిధి: గద్వా ల జోగులాంబ జిల్లాలోని అలంపూర్ రవాణా శాఖ చెక్ పోస్టు అవినీతికి, అక్రమాలకు కేరాఫ్‌గా మారిం ది. 44వ హైదరాబాద్,అక్రమంగా రవాణా చేసే వా హనాలతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనా లకు పన్నులు వసూళ్లు చేయాల్సిన ఇక్కడి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నప్పటికీ మామూళ్లు చేతిలో పెడితే చాలు రయ్యినా వెళ్లిపోవచ్చు.బెంగుళూర్ జాతీయరహదా రిపై ఉన్న ఈ అంతరాష్ట్ర ఆర్‌టిఎ చెక్ పోస్ట్‌లో విధు లు వేయించుకునేందుకు లక్షల్లో ముడుపులు చెల్లిం చుకొని ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించుకుంటున్నారనే ఆరోపణలు భలంగా ఉన్నాయి.ఈ చెక్‌పోస్టులో ప్రతి ఎనిమిది గంటలకు ఒక ఎంవిఐ విధులు నిర్వహిం చాల్సి ఉంటుంది. వీరు ఎంతో నిజాయితిగా విధులు నిర్వహిస్తే అక్రమ వాహనాలకు చెక్ పెట్టడడంతో పాటు, ప్రభుత్వంకు కూడా ఆదాయం చేకూర్చి పెట్టాల్సి ఉంటుంది. కాని ఇక్కడి అధికారులు అ మామూళ్లకు అలువాటు పడి విధుల్లో నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

ఇటీవల ఒక అధికారి ఇక్కడి పోస్టింగ్ కోసం లక్షల్లో మామూళ్లు ఇచ్చుకొని ఇక్కడికి పోస్టింగ్ ఇప్పించుకొని ఇటీవలే చేరినట్లు తెలుస్తోంది. తాము వసూళ్లు చేస్తే ఇబ్బందులు ఉంటాయని గ్రహించిన ఇక్కడి అధికా రులు ప్రవేట్ సిబ్బందిని నియమించుకొని ,వారికి జీతాలు చెల్లించి మరీ వసూళ్లుకు పాల్పడుతున్నార న్న ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రవేట్ వ్యక్తులు ఇష్టా రాజ్యంగా లారీలు,ఇతర వాహనాల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.

వారు వసూళ్లు చేసిన మామూళ్లలో,వారి నెల వారి జీతాలు చెల్లించి,మిగిలిన అన్ని పైసలను జేబుల్లో వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.గతంలో ఇక్కడి చెక్ పోస్టుపై ఎసిబి అధికారులు పలు సార్లు తనఖీలు చేశారు. ఈ తనఖీల్లో అక్రమంగా ఉన్న డబ్బు కూడా లభించింది. అయితే వారిపై చర్యలు ఏమయ్యాయో ఇంత వరకు తెలియ రాలేదు. గతంలో ఇక్కడ పని చేసి వసూళ్లు చేసిన వ్యక్తి కూడా అరెస్ట్‌కు గుర య్యారు.ఇంత అవినీతి,అక్రమాలు చోటు చేసుకు న్నా ఉన్నతాధికారులు ఈ చెక్ పోస్టు అధికారులపై చర్యలు ఏ మాత్రం తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇక్కడి ఎంవిఐలకు స్థానిక ప్రజాప్రతిని ధులతో పాటు ఉన్నతాధికారుల అండదండలు ఉన్న ట్లు సమాచారం.

వీరి అండదండలతోనే వారు ఇష్టారాజ్యంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అక్రమ వసూళ్లకు పాల్పడుకుండా ఉండేందుకు ఉన్న సిసి కెమెరాలు కూడా చెడగొట్టి వసూళ్లకు చేస్తున్నట్లు తెలుస్తోంది.ప్రైవేట్ వ్యక్తులే ఈ చెక్ పోస్ట్‌పై పట్టు సాధించి వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారు. ఇప్పటి కైనా ఆ చెక్‌పోస్టులో జరిగే అవినీతిపై చర్యలు తీసు కోవాలని కోరుచున్నారు.

Comments

comments