Search
Friday 21 September 2018
  • :
  • :

అవినీతి కోరల్లో మిషన్ కాకతీయ

Mission-kakatiya

అమరచింత: రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్‌కాకతీయ పనులు పక్కదారి పడుతున్నాయి. మండల కేంద్రంలోని 100,102 సర్వేనెంబర్లలో పట్టా భూములు గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ నాయకులు పట్టాభూముల్లో అవసరం లేని చోట మిషన్‌కాకతీయ పనులకు అధికారులతో పనులను మంజూరు చేయించుకున్నారు. వివరాల్లోకి వెళితే గ్రామ శివారులోని కర్నాల్‌కుంట ఉన్నది. ఈ కుంట చాలా పాతది . ఈ కుంటలోనే అధికార పార్టీ నాయకుని పట్టా భూములున్నాయి. ఈ కుంట నుండి 200 ఫీట్ల దూరంలో భీమా కాలువ, కుంటకు ఆనుకుని అమరచింత లిఫ్ట్‌కాలువలు పారుతున్నాయి. ఈ రెండు కాలువల మధ్య నాయకునికి 10 ఎకరాల భూమి ఉంది.

గత సం,,ము అధికారులు ఈ నేతకు దాసోహం అయి అవినీతికి తెరలేపారు. ఈ కుంట వల్ల సెంటుభూమికి ఉపయోగం లేకపోయిన ఈ కుంటకు రూ లక్షల రూపాయలు 13 శాతంతో పనులను ఆనాయకునికి కట్టబెట్టారు. మిషన్‌కాకతీయ పనులను చేప డుతున్నట్లు అక్కడ మట్టితో కట్టలను వేయించారు. గత సం,,ము నుండి మిషన్ కాకతీయ పనులు చేపట్టాల్సిన ఆ పట్టా భూముల్లో కంది , వేరుశనగ పంటలను సాగు చేస్తున్నారు. గతంలో అమరచింత ఎత్తిపోతల పథకం కాలువను తమ కుటుంబసభ్యులకు, తనకు ఉన్న 30 ఎకరాల వ్యవసాయ పొలాలనుండి కాలువ లను తీసుకువెళ్లి రైతులకు అన్యాయం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ అధికార పార్టీకి చెందిన నాయకులు కీలకపదవిలో కొనసాగుతున్నారు.

ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన నాయకునిపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు వివిధ పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ కార్మీక సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షులు ఎస్ అజయ్ ..

కర్నాల్‌కుంటలోని పట్టా భూముల్లో అక్రమంగా మిషన్‌కాకతీయ పనులను చేపట్టి లక్షల రూ పాయలు ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేయడం అన్యాయం. వెంటనే కర్నాల్‌కుంటను సంబం ధిత అధికారులు పరిశీలించి ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. లేనిప క్షంలో వ్యవసాయ కార్మీకసంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడుతాం…
తాటికొండ సుధారాణి వైస్‌ఎంపిపి ….

అధికారం ఉందని అక్రమంగా పట్టా భూముల్లో మిషన్‌కాకతీయ పను లు చేపట్టడం అన్యాయం. వెంటనే సంబంధిత అధికారులు ఈ పనుల ను చేపట్టిన కాంట్రాక్టర్‌పై , అక్రమంగా నిధులు మంజూరు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అమరచింత ఎత్తిపో తల పథకం కింద చెరువుకు వెళ్లే కాలువను సొంత పొలంలో తీసుకు వెళ్లి రైతులకు అన్యాయం చేశారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
బిజెపి సీనియర్ నాయకులు రమేష్…

భీమా, అమరచింత ఎత్తిపోతల కాలువ మధ్య సొంత పొలంలో అక్ర మంగా మిషన్‌కాకతీయ పనులను చేపట్టి ప్రభుత్వ ధనాన్ని కాజేసిన ఆ కాంట్రాక్టర్‌ను సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలి. రూ లక్షల రూపాయలతో పట్టాభూములు మట్టి చేసి లక్షల రూపాయలు స్వాహా చేసిన సంఘటనపై గతంలో బిజెపి వ్యతిరేకించదన్నారు. ఈ పట్టా భూముల్లో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మకై నారని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. వెంటనే అధికారులు ఈ కుంటను పరిశీలించి చర్యలు తీసుకోవాలి.

Comments

comments