Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

విత్తన శుద్ధి కర్మాగారాల్లో …. అవినీతి దందా..

300 బస్తాల వరి విత్తనాలు  పక్కదారి..రైతుల ఆందోళన
అక్రమంగా నిల్వ ఉంచిన వాసవీ  ఆగ్రో గోదాంను సీజ్ చేసిన వ్యవసాయాధికారి

                   Seed-Cleaning

వనపర్తి ప్రతినిధి: వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ విత్తన శుద్ధ్ది కర్మాగారంలో అవినీతి దందా వెలుగు చూసింది. రైతులకు ఇవ్వాల్సిన వరి విత్తనా ల్లో అధికారులు ,వ్యాపారులు కుమ్మకైవిత్తనాలను పక్కాదారి పట్టిస్తున్న తతంగాన్ని రైతులు కనిపెట్టి అధికారులను నిలదీసి విత్తన శుద్ధ్ది కర్మాగారం దగ్గర ఆందోళన చేపట్టిన సంఘటన గురువారం వెలుగు చూసింది.

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి విత్తనాలు తరలించే మూడు లారీల్లో కెటాయించిన విత్తన బస్తాల కంటే అద నంగా బిపిటి 3 రకం గల వరి విత్తనాలను అక్రమంగా తరలించి వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సమీపంలో ఉన్న వాసవి ఆగ్రో కెమికల్స్ గోదాంలో నిల్వ ఉంచారు. రైతులకు విత్తనాలు ఇవ్వకపోవ డంపై ఆగ్రహంవ్యక్తం చేసిన రైతులు పక్కాదారిపట్టిన విత్తనాల గురించి కాంగ్రెస్ నాయకులకు చెప్పడంతో రైతులతో కలసి విత్తన శుద్ధ్ది కర్మాగారం దగ్గర కాంగ్రెస్ నాయకులు ఆందోళనకు దిగారు.డిఎం సుదర్శన్ అవినీతి వల్ల విత్తనాలు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. మహ బూబ్‌నగర్‌లో పని చేయాల్సిన అటెండర్‌ను వనపర్తి విత్తన శుద్ది కర్మాగారంలో ఉంచుకొని డిఎం సుదర్శన్ అవినీతికి పాల్పడుతున్నారని వారు అన్నారు.

దాదాపు మూడు ,నాలుగు గంటల పాటు ఆందోళన చేపట్టిన రైతులు వాసవి ఆగ్రో గోదాం దగ్గర కూడా ఆందోళన చేసి వ్యవసాయాధికారులకు పిర్యాదు చేశా రు. సంఘటన స్థలానికి వచ్చిన వ్యవసాయాధికారి హన్మంత్‌రెడ్డి వరి విత్తనాలున్న వాసవి ఆగ్రో గోదాంను సీజ్ చేసి రైతులకు ఒక తాళం అతని దగ్గర మరో తాళాన్ని ఉంచుకున్నారు. దీంతో రైతులు శాంతించి ఆందోళన విరమించారు. ఈ ఆందోళన లో కాంగ్రెస్ నాయకులు కిరణ్‌కుమార్, నందిమల్ల కౌన్సిలర్‌లు నందిమల్ల భువనే శ్వరీ,విజయలక్ష్మీ, శ్యాం, తదితరులు ఉన్నారు.

Comments

comments