Home నిర్మల్ భక్తులతో కిటకిటలాడిన బాసర ఆలయం

భక్తులతో కిటకిటలాడిన బాసర ఆలయం

Devotees

బాసర : బాసర పుణ్య క్షేత్రమైన సరస్వతి అమ్మవారి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మంచి ముహూర్తం కలిసి రావడంతో 2 రోజుల పాటు రంజాన్ వేడుకల సందర్భంగా సెలవులు ఉండడంతో భక్తులు సూదూర దూర ప్రాంతాల నుండి రైలు, బస్సు మార్గాల నుండే కాకుండా తమతమ ప్రత్యేక వాహనాల్లో ఆలయక్షేత్రానికి తరలివచ్చి గోదావరి నదిలో పుణ్యస్నానా లు ఆచరించారు. అనంతరం  నది ఒడ్డున శివాలయాన్ని దర్శించుకుని నేరుగా అమ్మవారి దర్శనానికి బయలు దేరగా ఆలయంలో భారి కేడ్లలో భక్తులు నిలుచోగా దర్శనానికి గంట నుంచి 2 గంటల సమయం పట్టింది.

భక్తులు తమ చిన్నారులకు 870 అక్షరాభ్యాసాలు చేపట్టగా కుంకుమా ర్చన, లడ్డూ పులిహోర ప్రసాదాలు, ఆలయ అతిథి గృహాల నుండి వచ్చిన మొత్తం ఆదాయం 5 లక్షల పైచిలుకు సమకూరగా 15వేల వరకు భక్తులు అమ్మవారిని దర్శించు కని ఉంటారని ఆలయాధికారులు పేర్కొన్నారు. ఆలయం లో ఉదయం నుండి సాయంత్రం వరకు భక్తులతో కోలాహలం ఏర్పడగా క్షేత్రంలో రోడ్డుకు ఇరువైపులా వాహ నాలు నిలపడంతో పార్కింగ్ స్థలంలేక, ద్విచక్రవాహనాలు, బస్సులు నడుపడానికి ప్రయాణికులకు కాస్త ఇబ్బందిగా మారింది. దీంతో ఆలయాధికారులు, పోలీసులు అప్ర మత్తమై రోడ్డుకు ఇరువైపులా ఉన్న వాహనాలను తొలగిం చడంతో వాహనాదారుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా  సులభమైంది.