Search
Monday 23 July 2018
  • :
  • :

ప్రపంచంలో తొమ్మిదో ఖరీదైన ప్రదేశం కన్నాట్ ప్లేస్

Kannate-Place

న్యూఢిల్లీ: భారత దేశ రాజధాని ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ ఖరీదైన కార్యాలయ ప్రదేశాల్లో ప్రపంచంలోనే 9వ స్థానంలో ఉందని ప్రాపర్టీ కన్సల్టెంట్ సిబిఆర్‌ఇ పే ర్కొంది. కన్నాట్ ప్లేస్‌లో వార్షిక అద్దె కార్యాలయాల కు చదరపు అడుగుకు 153 అమెరికా డాలర్లుగా ఉం దని తెలిపింది. కాగా ఆఫీస్ లొకేషన్‌లో ముంబయికి చెందిన బాంద్రా కుర్లా కాంప్లెక్స్ 16వ స్థానం నుంచి 26వ స్థానానికి దిగజారింది. అక్కడ వార్షిక అద్దె చదరపు అడుగుకు 72.80 అమెరికా డాలర్లుగా ఉంది. గత ఏడాది బాంద్రా కుర్లా కాంప్లెక్స్, నారిమన్ పా యింట్ 16, 30 స్థానాల్లో ఉండేవి. ప్రాపర్టీ కన్సల్టెంట్  సిబిఆర్‌ఇ తన వార్షిక ప్రాపంచిక ప్రాథమిక కార్యాలయ ప్రదేశాల ఖర్చుల  సర్వే విడుదల చేసింది.

ఖర్చు అత్యంత నాణ్యమైన ప్రాథమిక కార్యాలయాల ఆస్తుల  అద్దె, స్థానిక పన్నులు, సేవల చార్జీలు వంటివన్నింటినీ ప్రతిబింబిస్తుంది. ‘ఢిల్లీ ప్రాథమిక మార్కెట్ అయినందున అక్కడ కార్యకలాపాలు గణనీయంగా సాగుతుంటాయని, దాంతో ఖాళీల స్థిరత్వం, అద్దెలు, అన్ని ఖర్చులు కలుపుకుని ప్రపంచంలో 9వ స్థానానికి ఎగబాకింది’ అని సిబిఆర్‌ఇ చైర్మన్ తెలిపినట్లు అన్షుమన్ మేగజైన్ పేర్కొంది. ముంబయి మార్కెట్‌పై కూడా ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రానున్న నెలల్లో ఊపందుకోవచ్చన్నారు. సిబిఆర్‌ఇ నివేదిక ప్రకారం ప్రపంచంలో హాంకాంగ్(సెంట్రల్) చదరపు అడుగుకు 306.57 అమెరికా డాలర్ల అద్దెతో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉంది.

తర్వాతి స్థానాల్లో లండన్(వెస్ట్ ఎండ్), చైనాలోని బీజింగ్(ఫైనాన్స్ స్ట్రీట్), హాంకాంగ్(కోవ్‌లూన్), బీజింగ్(సిబిడి) ఉన్నాయి.  చదరపు అడుగుకు 183.78 అమెరికా డాలర్ల  వార్షిక అద్దెతో  న్యూయార్క్(మిడ్‌టౌన్-మ్యాన్‌హట్టన్) ఆరో స్థానంలో ఉంది. కాగా న్యూయార్క్(మిడ్‌టౌన్‌దక్షిణ మ్యాన్‌హట్టన్) చదరపు అడుగుకు 171.56 అమెరికా డాలర్లతో వార్షిక అద్దెలో 7వ స్థానంలో ఉంది. టాప్ 10 జాబితాలో జపాన్‌కు చెందిన టోక్యో(మరునోచి/ఒటెమాచీ) ఎనిమిదవ స్థానంలో, ఇంగ్లాండ్‌కు చెంది న లండన్ 10వ స్థానంలో ఉన్నాయి.

Comments

comments