Home మంచిర్యాల మంటలు అంటుకుంటే మసే

మంటలు అంటుకుంటే మసే

నిబంధనలు పాటించకుండా భవనాలు
ఇరుకైన ప్రాంతాలలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలు
పర్యవేక్షణ లేని అగ్నిమాపక

More Fire Accident in Mancheriala

మంచిర్యాలటౌన్: వ్యాపార, వాణి జ్య కేంద్రమైన మంచిర్యాలలో అగ్నిమాపక శాఖ నిబంధనలను పాటించడంలో వ్యాపారులు నిర్ల క్షం వహిస్తున్నారు. అగ్నిప్రమాదాలు జరగ కుండా జాగ్రత్తలు పాటించాల్సిన భవన యాజ మా నులు నిబంధనలను బేఖాతార్ చేస్తూ నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇరుకైన ప్రాంతాలలో అపార్ట్‌మెంట్ లను ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను ఆర్పడం కష్టతరంగా మారుతుంది. వ్యాపార, వాణిజ్య సముదాయాలు నిర్మాణ సమయంలో అగ్నిమాపకశాఖ నుండి అను మతి పొందాల్సి ఉన్నప్పటికి ఎలాంటి అనుమతి లేకుండానే భవన సముదాయాలను చేపడుతున్నా రు. ఈ విషయంలో చర్యలు తీసుకోవాల్సిన అగ్ని మాపక శాఖాధికారులు కూడ మమూళ్ళుగా వ్యవ హారిస్తున్న తీరు తీవ్ర విమర్శాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల పట్టణ ప్రాంతాలలో వ్యా పార కేంద్రాలు ఉన్న ఏరియాలు ఇరుకైన ప్రాంతం లో ఉండడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ప్రమాదాలు ఎదురైనప్పుడు అగ్ని మాపక సిబ్బంది హుటహుటిన సంఘటన ప్రాంతాలకు చేరుకున్నప్పటికి మంటలను ఆర్పడానికి నానా అవ స్థలు పడాల్సివస్తుంది.ఫైర్ ఇంజన్‌ను ఘటన ప్రాం తానికి తీసుకెళ్ళాడంలో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మంటలు వ్యాపించి భారీ నష్టం వాటి ల్లుతుంది. పట్టణంలోని బస్టాండ్, కూరగాయల మార్కెట్, వెంకటేశ్వర టాకీస్‌రోడ్, ఆర్‌పిరోడ్ ప్రా ంతాలు నిత్యం వాహనల రాకపోకలతో రద్దీగా ఉంటాయి. సరియైన పార్కింగ్ స్థలాలు లేక రోడ్ల పైనే వాహనాలను పార్కింగ్ చేస్తుండడం వల్ల ప్ర మాదాలు జరిగిన సమయాలలో అత్యవసరమైన ఫైర్ ఇంజన్ కూడ ముందుకు కదలలేకపోతుంది. ఇక్బాల్ అహ్మాద్ నగర్, గౌతమినగర్, రెడ్డికాలనీ, రాంనగర్, ఒడ్డెర కాలనీ,హైటెక్ సిటి తదితర ప్రాం తాలలో భవన నిర్మాణాలు జరుగుతున్నప్పటికి నిబ ంధనలను తుంగలో తొక్కి అపార్ట్‌మెంట్‌లు నిర్మిస్తు న్నారు. అధికార యంత్రాగం ఈ విషయంలో చూ సిచూడనట్లు వ్యవహారించకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవడం ఎంతైనా అవసరం.

వేసవికాలంలో భయం… భయం

ప్రస్తుత వేసవికాలం నేపథ్యంలో అగ్నిప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. అటవీ ప్రాం తంతో పాటు క్వారీలు, పంటపొల్లాలు ఎక్కువ ఉం డడం వల్ల నిప్పురవ్వలకు అగ్నిప్రమాదాలు జరిగే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు రైస్‌మిల్లులు, బీడి ఆకు గోదామ్‌లు,పేపర్‌ప్లేట్ తయారీ,పత్తి కోను గోలు కేంద్రాలు, వాణిజ్య వ్యాపారులు ముందు జా గ్రత్తలు ఈ కాలంలో తీసుకోవడం ఎంతై నా అవస రం. నిర్లక్షం వహిస్తే ప్రమాద తీవ్రతరం ఎక్కువ జరిగి భారీ నష్టం వాటిల్లే అవకాశాలు లేకపోలేదు.