Search
Friday 21 September 2018
  • :
  • :

చెలగాటం..

Building

అగ్గి రగిలితే జీవితాలు బుగ్గే
పట్టించుకోని అధికారులు

నాగర్‌కర్నూల్ ప్రతినిధి: బహు ళ అంతస్తుల భవన నిర్మాణాలు,విద్యా సంస్థలు , ఇతర ప్రైవేటు వ్యాపార,వాణిజ్య సంస్థలు అగ్ని మాపక నిబంధనలకు చెల్లు చీటి ఇస్తున్నాయి. చిన్న అగ్నిప్రమాదం జరిగినా తీరని నష్టం కలిగే అవకాశాలున్నాయి. ప్రాణాలతో చెలగాటం ఆడే విధంగా వ్యవహరిస్తున్న వారిపట్ల అగ్నిమాపక సంస్ధ, విద్యాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవ హరిస్తున్నాయి. అడవులు ,గ్రామాలు, ఆరు బయ ట ప్రదేశాలు,పశుగ్రాసం,గుడిసెల ఆగ్ని ప్రమాద నష్టాలపైనే దృష్టి పెడుతున్న అధికారులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని నడిబొడ్డున పొంచి వున్న అగ్ని గుండాల గురించి ఒక్క క్షణమైనా ఆలోచిస్తున్న దాఖలాలు లేవు.

అవసరమైన అగ్ని మాపక పరికరాలు, వాటికి సంబందించిన అను మతులు లేకుండా నిబంధనలు పాటించకుండా నిర్లక్షంగా వ్యవహరిస్తున్నారు. వేలాది మంది చిన్నారులు ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే పాఠ శాలలు,యువకులు ఉండే కళాశాలలేగాక వినోదం పంచే సిని మాహాళ్లు,అవసరాలకోసం వెళ్లే షాపింగ్‌మాల్స్, ఇతర బహుళ అంతస్తుల భవనాలలో ప్రమాదాలు పొంచి వున్నా వాటి యాజమాన్యాలు ప్రాణాలతో చెలగాట మాడుతున్నా అధికార యంత్రాంగం మొద్దు నిద్రన టిస్తున్నది. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు పాఠశాలలు ,కళా శాలలు నిబంధనలు పాటించడంలేదు. తరచూ తనఖీ లు చేస్తున్న విద్యాశాఖాదికారులకు సైతం అగ్ని ప్రమాదాల పట్ల ధ్యాసేలేదు.

చిన్నారుల భవిష్యత్‌తో చెలగాటం…

కొత్త కొత్త పేర్లతో వేలాదిరూపాయలు ఫీజులు ఇతర రూపాల్లో వసూలు చేసే ప్రైవేటు విద్యాసంస్థలు తమ పాఠశాలకు వచ్చే చిన్నారుల భద్రత పట్ల ఏ మాత్రం పట్టించుకోవడంలేదని చెప్పవచ్చు పట్టణంలో మొత్తం 30ప్రైవేటు పాఠశాలలుండగా ఇందులో అత్యధికంగా 26పాఠశాలల్లో నిబంధనలు పాటించడంలేదు. కేవలం 5 పాఠశాలల్లో మాత్రం వీటికి సంబందించిన పరికరాలున్నాయి. ఇక కళాశాలల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలో మొత్తం 15కు గాను 9కళాశాలల్లో పరికరాలున్నాయి.వీరిలో కూడా నిబంధనలు పూర్తిగా పాటించని కళాశాలలు 9ఉన్నాయి.

ఇక ఫంక్షన్ హాల్స్ పరిస్థితి మరింత ఘోరం.తరచూ రంగుల దీపాలతో అలంకరించడమేగాక ఇతరత్రా ఎలక్ట్రానిక్,విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండే ఇక్కడ అగ్నిమాపక భద్రత ఊసేలేదు. జిల్లా కేంద్రంలో మొత్తం 7ఫంక్షన్ హాల్స్ ఉండగా ఒక్కటంటే ఒక్కచోటకూడా అగ్నిమాపక పరికరాలు గాని వాటికి సంబందించిన అనుమతులు గాని లేవు. ఇక్కడ ఉన్న మూడు సినిమాథియోటర్లలలో అగ్నిమాపక పరికరాలున్నప్పటికి ఇతర నిబంధనలు పాటించడంలేదు. వాణిజ్య సంస్థల పరిస్థితికూడా ఇదేవిధంగా ఉంది. సంత్సరాల తరబడి కొనసాగుతున్న ఈ నిబంధనల ఉల్లంఘనలపట్ల అటు అగ్నిమాపక శాఖగానీ ఇటు మున్సిపల్, విద్యాశాఖలు గాని పట్టి పట్టనట్లు వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తున్నవి వేసవి వచ్చేసింది.వాతావరణం క్రమంగా నిప్పుల కొలిమిలా మారుతుంది. అధికారలు ఇప్పటికైనా మేల్కొంటే బాగుంటుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్త మవుతుంది.
అధికారులు కళ్లు తెరవాలి…
వావిలాల రాజశేఖర శర్మ
సహచట్టం కార్యకర్త , నాగర్‌కర్నూల్

అగ్నిమాపక నిబంధనలు అమలు చేయడంలో అధికార యంత్రాంగం విఫల మయింది.చేతులు కాలాక ఆకులు పట్టు కునే బదులు ముందుగా జాగ్రత్త పడటం మంచిది. ముఖ్యంగా అధికారుల నిర్లక్షం పాఠశాల ల్లో చిన్నారుల భవి ష్యత్తును ఫణంగా పెడుతున్నట్లుగా ఉంది. కొత్త జిల్లాలో ఐనా వీటిపై అధికా రులు దృష్టిపెట్టాలి

Comments

comments