Home కామారెడ్డి నాయబ్ నయా కోణం

నాయబ్ నయా కోణం

కామ్‌దార్ల ఖాతాల్లో నల్లధనం మార్పిడి
ఎల్లారెడ్డి డిటిపై సస్పెన్షన్ వేటు
కలెక్టర్‌పై ఒత్తిడి
ఎట్టకేలకు పదోన్నతికి బ్రేక్

Letter

నిజామాబాద్ : కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి తహాశీల్దార్ కార్యా లయంలో రాత్రి వేళలో విధులు నిర్వ హించిన కామ్‌దార్లను నాయబ్ తహాశీల్దార్ చితకబాధిన వ్యవహరంలో విచారణ పూర్త యింది. నివేధిక ఆధారంగా జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గత నెలలో డిప్యూటి తహాశీల్దార్ శేర్ల వెంక టేశంను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై గత నెల 21న                 మన తెలంగాణలో “ముదురుతున్న వివాదం” పేరుతో వార్త ప్రచురించిన ఆదా రంగానే ఆ అవినీతి అధికారిపై కొరడ ఝులి పించారనడానికి విచారణ నివేధిక అడ్డం పడుతుంది. విచారణను తప్పుదోవ పట్టించిన ఆర్డిఒ దేవేందర్‌రెడ్డి రాజీ కుదిర్చే ప్రయ త్నాలను ముమ్మరం చేశారు. ఈ వివాదంలో తమను బలిపశువులుగా చేస్తున్నారనే అను మానంతో బాధిత కామ్‌దార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. విచారణ జాప్యం అవడంతో విఆర్‌ఎ అసోసియేషన్               ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టింది.  ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ సత్యనారాయణ వేచి చూడకుండా ఆందోళన చేయడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

ఆర్డివో తీరుతోనే తాము రోడ్డెక్కాల్సి వచ్చిందని కామ్‌దార్లు కలెక్టర్ ఎదుట వాపోయారు. ఇంత రాద్దాంతం వెనుక అసలు కథ ఏమిటో తెలుసుకునేందుకు విచారణకు ఆదేశిస్తానని స్పష్టం చేశారు. దీంతో అందోళనకు గురైన గ్రామ సేవకులు గత నెల 23న లిఖిత పూర్వకంగా జరిగిన విషయాన్ని కలెక్టర్‌కు సమర్పించారు. 15 మంది కామ్‌దార్ల బ్యాంక్ ఖాతాల్లో నాయబ్ తహాశీల్దార్ నల్లధనం మార్పిడి చేశారని తెలిపారు. ఈ అక్రమ లావాదేవీలకు తాము సమ్మతించకపోవడంతో కక్ష కట్టిన డిటి తమపై మద్యం మత్తులో దాడి చేశాడని ఆవేధన వ్యక్తం చేశారు. ఈ విషయం విచారణలోను బయటపడడంతో ఆ అవినీతి అధికారిని సస్పెండ్ చేస్తు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

సస్పెన్షన్ ఎత్తివేతకై ముమ్మర ప్రయత్నాలు : జిల్లాలో 51 మంది డిప్యూటి తహాశీల్దార్లకు పదొన్నతి కల్పించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తున్న సంగతి తెలుసుకున్న ఆ అవినీతి అధికారి, కలెక్టర్‌పై ఒత్తిడి పెంచడాన్ని విఫల యత్నాలు చేశాడు. స్థానిక శాసన సభ్యుని సహాయం తీసుకోవాలని ప్రయత్నించడంతో ఈ వ్యవహారంపై ఆయన గుర్రుగా ఉన్నారని తెలియడంతో విరమించుకున్నాడు. ఆర్డిఓ దేవేంధర్ రెడ్డి మధ్యవర్తిత్వంతో జేసి సత్తయ్యను కలిసి సస్పెన్షన్ గండం నుంచి బయటపడేందుకు యత్నించాడు. ఈ వ్యవహారం కలెక్టర్ చెంత ఉండడంతో జేసి నుంచి ఎలాంటి సహాయం అందలేదు. పదోన్నతి రానున్నడంతో ఆ డిటి విశ్వప్రయత్నాలు చేశాడు. రాజకీయ, అధికార, ఆర్థిక బలాలు పని చేయకపోవడంతో నిరాశకు గురైయ్యాడు.

జిల్లా కలెక్టర్‌ను ప్రసన్నం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో పాలనా ధికారి బాల్య మిత్రుడు, ప్రముఖ పారిశ్రామికవేత్తను కలిసి సంప్రదింపులు జరిపించాడు. అయినప్పటికి కలెక్టర్ డిటి విషయాన్ని పెడచెవిన పెట్టినట్లు తెలిసింది. ఇంతలోనే సస్పెన్షన్ ఉత్తర్వులు భూ పరిపాలన శాఖకు చేరడంతో ఆ అవినీతి అధికారికి చుక్కెదురైంది. 51 మంది డిప్యూటి తహాశీల్దార్ల పదొన్నతి జాబితా నుంచి శేర్ల వెంకటేశం పేరును తొలగించారు. ధన బలంతో తన పై స్థాయి అధికారులను మచ్చిక చేసుకొని, స్వంత ఊరిలో నాయబ్ తహాశీల్దార్‌గా విధులు నిర్వహించిన ఆయనకు తగిన శాస్తి జరిగిందని స్థానికులు ముచ్చటించుకోవడం కొసమెరుపు.

నల్లధనం మార్పిడిపై చర్యలు శూన్యం : గ్రామ సేవకులకు నెలసరి వేతనాలను డిప్యూటి తహాశీల్దార్ వెంకటేశం అందించడమే అక్రమాలకు ఆజ్యం పోసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న ఆయనకు పెద్ద నోట్ల రద్దు ఆంశం తలనొప్పిగా మారింది. సుమారు కోటి రూపాయల వరకు పాత నోట్లు ఉండడంతో వాటిని కామ్‌దార్ల ఖాతాల్లో వేసి బయట పడాలని ఆలోచన చేశాడు. గ్రామ సేవలకులతో వేర్వేరుగా మంతనాలు జరిపి 15 మంది బ్యాంక్ ఖాతాల్లో నల్లధనాన్ని జమ చేశాడు. మరికొందరు ఆయన మాట వినకపోవడంతో వారిని వేదించడం మొదలుపెట్టాడు. మద్యం మత్తులో డ్యూటిలో ఉన్న ఐదుగురు కామ్‌దార్లను చితకబాదడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. విచారణలో నిజాలు బయటపడిన ఆ అధికారిపై అక్రమ నగదు మార్పిడికి సంబంధించి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

బినామి పేరుతో కారు కొనుగోలు!!

లింగంపేట మండలంలో ఉన్న తన వ్యవసాయ భూమిలో ఒంటరిపల్లికి చెందిన రాపర్తి గంగామణి కూలీగా పని చేస్తుంది. రెక్కడితేగాని డొక్కాడని ఆ నిరుపేద దళిత మహిళ పేరుతో ఆ అవినీతి అధికారి టిఎస్ 16 యుఏ 7652 ఎర్టిగా కారును సికింద్రబాద్ ఇండస్ ఇండ్ బ్యాంకు రుణ సహాయంతో కొనుగోలు చేశారు. తన సోదరులు, బంధువుల పేర్లతో వ్యాపారాలు నిర్వహిస్తు కోట్లాది రూపాయలు వెనకేసుకున్నారని సమాచారం.