Search
Friday 16 November 2018
  • :
  • :

అమ్మపల్లి మిషన్ కాకతీయ పనుల్లో కొనసాగిన అవినీతి…!

ఒండ్రు మట్టి తరలించకుండానే నిధులు స్వాహా
కాంట్రాక్టర్ జేబులు నింపేందుకు ఐబి అధికారుల విశ్వప్రయత్నం

Mission-kakatiya1

మనతెలంగాణ/పెద్దమందడి: మండల పరిధిలోని అమ్మపల్లి అమ్మచెరువుకు ప్రభుత్వం రెండవ విడత మిషన్ కాకతీయ ద్వారా రూ.44లక్షలు మంజూరు చేస్తూ పనులు చేసేందుకు టెండర్లు నిర్వహిం చింది. ఈ టెండర్లలో రూ.4.5లక్షల తక్కువకు ప్రతాఫ్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ పనులు దక్కించుకున్నాడు. చెరువు లో కంప చెట్లను తొలగించి ఒండ్రు మట్టిని రైతుల పొలాల్లోకి తరలించాలని పక్క నిబంధనలు ఉన్నప్ప టికి కాంట్రాక్టర్‌కు మేలు చేసేందుకు ఐబీ అధికారు లు నిబంధనలు తుంగలో తొక్కి ఒండ్రు మట్టి,కంప చెట్లను తొలగించకుండానే 2000వేల క్యూబిక్ మీట ర్ల ఒండ్రు మట్టిని తరలించినట్లు ఎంబీ రికార్డు చేసి కాంట్రాక్టర్‌కు రూ.25లక్షల దాక బిల్లులు చెల్లిం చారని అమ్మపల్లి అమ్మచెరువు రైతులు ఆరోపించా రు.

ఆదివారం కొందరు రైతులు విలేకరులను చెరువు దగ్గరికి తీసుకేళ్ళి పనుల ప్రగతిని,చేయాల్సిన పనుల వివరాలను వివరించారు.కేవలం చెరువు కట్టపై మోర్రం వేసి నిధులు స్వాహా చేశారని వారు అన్నారు.కంప చెట్లు తోలగించకుండా ,ఒండ్రు మట్టి తీయకుంటే మిషన్‌కాకతీయ పనులకు అర్థం ఏమిటని వారు ప్రశ్నించారు.ఈ విషయమై ఐబి అధికారులకు ,ఎస్‌ఈకి ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వారు అన్నారు.అధికారులు కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతూ అగ్రిమెంటు, బిల్లుల చెల్లింపులో భారీగా పర్సేంటేజిలు తీసుకుంటున్నారని ,రైతుల పొలాల్లో గంపేడు ఒండ్రు మట్టి కూడా నేటికి తరలించకుండా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఏలా చేస్తారని భారీనీటి పారుదల శాఖ మంత్రి హరిష్‌రావు,జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి,సాగునీటి శాఖ ముఖ్య కార్యనిర్వహణ అధికారికి ,సీఈ,ఈఎన్‌సిలకు ఫిర్యాదు చేయనున్నట్లు అమ్మపల్లి రైతులు తెలిపారు.

Comments

comments