Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

నిధులున్నా అభివృద్ధికి నోచుకోని మల్లంపల్లి

జన నివాసాల నడుమ ప్రవహిస్తున్న మురుగునీరు
కానరాని స్వచ్ఛభారత్
పట్టించుకోని అధికారులు

Drainage

ములుగు రూరల్ : పల్లెలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే అధికారుల నిర్లక్షం వల్ల ఆ కార్యక్రమాలకు అర్థం లేకుండా పోతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ విజయవంతం వైపు అధికారులు దృష్టి సారించకపోవడంతో పారిశుధ్యం పడకేసి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. అభివృద్ధికి సరిపడా ఆదాయం ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్షం వల్ల గ్రామస్తులు అసౌకర్యాల నడుమ జీవనం కొనసాగించాల్సిన దుస్థితి మండలంలోని మల్లంపల్లి గ్రామంలో నెలకొంది. మల్లంపల్లి మేజర్ గ్రామపంచాయతీలో ప్రతియేటా రూ.35లక్షల ఆదాయం ఉన్నప్పటికీ ఆ నిధులను సక్రమంగా ఉపయోగించి గ్రామాభివృద్ధి చేపట్టాల్సిన అధికారుల వ్యవహారం వల్ల వివిధ ప్రాంతాల నుండి వస్తున్న మురుగునీరు జన నివాసాల మధ్య నుండి ప్రవహిస్తుంది. దీంతో ప్రజలు మురుగునీటి దుర్వాసనను భరిస్తూ బతుకుతున్నట్లు పలువురు గ్రామస్తులు పేర్కొంటున్నారు.

అధికారులు పట్టించుకోవడంలేదు : గొల్లపల్లి యాకయ్య

గ్రామంలో మురుగుకాల్వలను మరమ్మతు చేయాలని గతంలో జరిగిన గ్రామసభల్లో అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడంలేదు. వర్షాకాలంలో అయితే వర్షపునీరు, మురుగునీరు ఇంటిలోకి చేరి అనారోగ్యంబారిన పడే పరిస్థితి నెలకొంది. గ్రామపంచాయతీ అధికారులు మురుగుకాల్వలను బాగు చేయాలి.

రోగాలబారిన పడుతున్నాం : వడ్డెపల్లి జ్యోతి

గ్రామంలోని మురికినీరంతా తమ ఇంటి చుట్టూ చేరి దుర్వాసన వస్తుంది. నిల్వనీటిలో దోమలు వృద్ధి చెందిన రోగాలను కొనితెచ్చుకుంటున్నాం. కాయకష్టం చేసి సాయంత్రం ఇంటికి రాగానే కాల్వనుండి వచ్చే దుర్వాసనతో నిద్ర పట్టడంలేదు. గ్రామపంచాయతీ అధికారులు కలుగజేసుకుని మురుగుకాల్వల్లో నీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలి.

Comments

comments