Home రాష్ట్ర వార్తలు ఇరిగేషన్‌కు మరింత ప్రాధాన్యం

ఇరిగేషన్‌కు మరింత ప్రాధాన్యం

వచ్చే ఏడాది నుంచి 30-35 వేల కోట్లు కేటాయింపు, చంద్రబాబు అడ్డుకోకపోతే
30 నెలల్లో పాలమూరు పూర్తి : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు

harish-raoహైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారు రూ.1,50,000 కోట్లు అవసరమని, పాత ప్రాజెక్టులకు రూ. 15,700 కోట్లు అవసరమవుతాయని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు తెలిపారు. నీటిపారుదల పద్దులపై శాసన సభలో జరిగిన చర్చకు మంగళవారం ఆయన సమాధానిచ్చారు. తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ప్రాజెక్టులకు రూ.25వేల కోట్లు కేటాయించామని, వచ్చే ఏడాది నుంచి ప్రాజెక్టులకు రూ. 30 నుంచి 35 వేల కోట్ల నిధులను కేటాయిస్తామని ప్రకటించారు. నీటి పారుదల ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను సాగునీటి బాట పట్టిస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూనే కొత్త ప్రాజెక్టులను నిర్మిస్తూ ముందుకెళ్తామని వివరించారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నిర్మాణ అంశంలో పక్క రాష్ట్ర సిఎం చంద్రబాబు ఆటంకాలను సృష్టించకపోతే 30 నెలల్లో పూర్తి చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాకు పాలమూరు, దిండి, కొండపోచమ్మ మూడు ప్రాజెక్టుల ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అంశంలో ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తోందని, పారదర్శకంగానే వ్యవహరి స్తున్నామని తెలిపారు.
ప్రాజెక్టులకు రూ.2 లక్షల కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు : జానారెడ్డి
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు సుమారు రూ.2 లక్షల కోట్లు అవసరమని, ఇన్ని నిధులు ఎక్కడి నుండి తెస్తారని సిఎల్‌పి నేత కె.జానా రెడ్డి కోరారు. ప్రాణహిత ప్రాజెక్టుకు రూ.83 వేల కోట్లు, డిండి ఎత్తిపోతలకు రూ.35వేల కోట్లు, పాలమూరు-రంగారెడ్డికి రూ.10వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.9 వేల కోట్లు, అదిలాబాద్‌లో ఎత్తిపోతలకు రూ.3వేల కోట్లు, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులకు రూ.4వేల కోట్లు, ఎస్‌ఎల్‌బిసికి రూ.3వేల కోట్లు, పెండింగ్ ప్రాజెక్టులకు రూ.20వేల కోట్లు కలిపితే మొత్తం రూ.1.80 లక్షల కోట్ల వరకు చేరుకుంటున్నదన్నారు. అవి పూర్తయ్యే నాటికి అదనంగా రూ.20వేల కోట్ల జతపరిస్తే మొత్తం రూ.2 లక్షలకు కోట్లు అవు తాయని జానా రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథకు రుణం లభించినట్లుగా , సా గునీటి ప్రాజెక్టులకు అప్పులు లభించే అవకాశమున్నదా అని జానారెడ్డి ప్రశ్నించారు. అసెంబ్లీలో మంగళవారం నీటిపారుదల, విద్యుత్, పంచాయతీ రాజ్ తదితర పద్దులపై జరిగిన చర్చ సందర్భంగా ఈ అంశాలపై ప్రభుత్వ వివ రణ కోరారు. ప్రాజెక్టులు పూర్తయిన తరువాత వాటి నిర్వహణ ఖర్చులు ఎంతవుతాయో, ఎలా సమకూర్చుతాయో చెప్పాలని ఆయన కోరారు. ఒక టిఎంసి నీటికి పదివేల ఎకరాలు సాగు అవుతుందని లెక్కలు ఉండగా, మీ ప్రభు త్వం 15 వేల ఎకరాలకు నీళ్ళిస్తామంటున్నారని చెప్పారు. ప్రాజెక్టుల రీ డిజైన్‌పై తమకు అభ్యంతరం లేదని, గత ప్రభుత్వంలో జరిగిన పరిణామాలు జరగబోవా అనేదే నా ప్రశ్న అన్నారు. తమ్మిడిహట్టి ఎత్తుపై గత ప్రభుత్వం సా ధించనిది ఎంత వాస్తవమో, అంత ఎత్తు వీలు కాదనేది కూడా అంతే వాస్తవ మన్నారు. ప్రాణహితను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని, తమ్మిడిహట్టి ఎత్తు పెంచాలని కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుందామని, అఖిలపక్షంగా వెళ్దామని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
కమీషన్ల కోసమే రీడిజైనింగ్: భట్టి విక్రమార్క
ప్రజల కోసం కాకుండా కమిషన్ల కోసమే ప్రాజెక్టులను రీ డిజైన్ చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో రా జీవ్, ఇందిరా గాంధీ ప్రాజెక్టుల పేర్లను మార్చారని, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి మీరిచ్చే విలువ ఇదేనా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో మంగ ళవారం నీటిపారుదల, విద్యుత్, పంచాయతీరాజ్ తదితర పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. తమ్మిడిహట్టి ఎత్తు 152 మీటర్ల ఎత్తులో నిర్మించా లని గత ప్రభుత్వం నిర్ణయిస్తే, ఈ ప్రభుత్వం 148 మీటర్లకు కుదించిందని ఆయన అన్నారు. 7 జిల్లాల ప్రజల కోసం ప్రాణహిత ప్రాజెక్టును చేపడితే, రీ డిజైన్ పేరుతో రూ.83వేల కోట్లకు పెంచారని, కొన్ని జిల్లాలను మినహా యిం చారని ఆయన తీవ్రంగా విమర్శించారు.
దీనిపై మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకొని గత ప్రభుత్వ హయాంలో ఎత్తు నిర్ణ యించలేదని, ఎత్తు ఖరారు చేయకుండా అప్పటి సిఎం కిరణ్ మహారాష్ట్ర ప్రభు త్వానికి లేఖ రాశారన్నారు. భట్టి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూతమ్మిడి హట్టి ఎత్తుపై నేను చెప్పేది వాస్తవమే, నా వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయి, 152 మీట ర్ల ఎత్తులో నిర్మించాలనే లక్షంతోనే మా ప్రభుత్వం గతంలో పనులు ప్రారం భించిందని ఆయన వివరించారు. ప్రాణహిత ప్రాజెక్టుకు ప్రాణం తీసేశారని, మహారాష్ట్ర ప్రభుత్వంతో సిఎం కెసిఆర్ ఏం మాట్లాడుకుని వచ్చారో తెలియడం లేదన్నారు. రీ డిజైన్ పేరుతో ప్రాజెక్టు వ్యయాన్ని రూ.83వేల కోట్లకు పెంచారని, ఇది ఎంతమాత్రం మంచిదికాదని ఆయన హితవు పలికారు. కాగా, ఇందిరా గాంధీల పేర్లతో స్వలాభం కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులు చేపట్టారని ఆర్ అండ్ బి మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రతిస్పందించారు.
ప్రాణహిత రీ డిజైన్ వల్ల రంగారెడ్డి జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఆయకట్టు కుదించారని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాజెక్టుల వారీగా, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తామని సిఎం చెప్పారని ఆయన అన్నారు.