Search
Sunday 18 November 2018
  • :
  • :

మహిళల్లో పెరుగుతోన్న కిడ్నీ సమస్యలు

కిడ్నీ వ్యాధి సంతానోత్పత్తి తగ్గిస్తోంది,  నేడు వరల్డ్ కిడ్నీ డే

Kidney-Day

మన తెలంగాణ/సిటీబ్యూరో : ప్రపంచ వ్యాప్తంగా కిడ్నీల వైఫల్యం(సికెడి) బారిన పడి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అధికంగా మహిళలు సికెడి బారిన పడి మరణిస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. నేడు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా మన తెలంగాణ ప్రత్యేక కథనం…పురుషులతో పోలిస్తే కిడ్నీ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య స్త్రీలలో ఎక్కువగా ఉందని ఇటీవల పలు అధ్యయనాలు సైతం వివరించాయి. ఈ సంఖ్య సగటున మహిళల్లో 14శాతం ఉంటే పురుషుల్లో 12శాతంగా ఉంది. అయితే డయాలసిస్ విషయానికొచ్చే సరికి స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే కిడ్నీ సంబంధ సమస్యలు మహిళల్లో నెమ్మదిగా వ్యాపిస్తుంటాయి.

మానసిక, సామాజిక అసమానతల వల్ల మహిళల్లో సికెడి బారిన పడ్డా తగిన చికిత్సలు పూర్తి స్థాయిలో అందడంలేదు. కిడ్నీ ధానం చేసేందుకు ముందుకొస్తున్న మహిళలు, వాటిని స్వీకరించేందుకు అదే స్థాయిలో ముందుకు రావడంలేదు. మహిళలకు సమాన ఆరోగ్య సదుపాయాలను కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కిడ్నీ జబ్బుల కారణంగా మహిళల్లో సంతానోత్పత్తి తగ్గడానికి కారణమని చెప్పవచ్చు. సికెడితో బాధపడుతున్న మహిళలు గర్భిణిలైతే పుట్టభోయే బిడ్డకు, తల్లికి కూడా ప్రతికూల ఫలితాలుంటాయి. ఇలాంటి వారిలో అధిక రక్తపోటు, ముందస్తు జననాలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

వీరికి డయాలసిస్ చికిత్స అందించడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించే అవకాశాలుంటాయి. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తరువాత మహిళలు సంతానోత్పత్తిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. మహిళల్లో సికెడి పట్ల అవగాహన కల్పించడంతో పాటు గర్భిణి స్త్రీలలో సికెడి పట్ల అవగాహన, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచి, తగిన చికిత్సలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గర్భ సంబంధ సమస్యల కారణాల వల్ల కూడా కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. మాతృ మరణాలకు మూడు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. ప్రీఎక్లంప్సియా, సెప్టిక్ అబ్డామిన్, పోస్టు పార్టమ్ హెమరేజ్(జననమైన తరువాత రక్తస్త్రావం) మరికొందరు మహిళల్లో తీవ్రమైన కిడ్నీ గాయాలు కారణాలుగా చెప్పవచ్చు. మహిళల్లో రోజురోజుకు పెరుగుతోన్న సికెడి జబ్బులపై అవగాహన కల్పించడంతో పాటు, డయాలసీస్ సేవలను అందుబాటులోకి తీసుకు రావాల్సిన అవసరముంది.

కిడ్నీ నివారణపై అవగాహన

వరల్ట్ కిడ్నీ డే, ప్రపంచ మహిళా దినోత్సవం రెండు ఒకే రోజు రావడం వల్ల మహిళల ఆరోగ్యం ప్రాముఖ్యతలో భాగంగా ప్రత్యేకంగా మహిళల్లో కిడ్నీ సమస్యలు, అవగాహన థీంను 13వ కిడ్నీ డే వార్షికోత్సవం సందర్భంగా ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా మహిళలకు ఆరోగ్యం, విద్యను అందించడంతో పాటు, అనారోగ్యల నివారణకు సరైన, సమాన ప్రోత్సాహం ఉండే విధంగా అందరూ కృషి చేయాలి.
– డాక్టర్ గందె శ్రీధర్
గ్లెనిగల్స్ గ్లోబల్ హాస్పిటల్స్ ఛీఫ్ నెఫ్రాలజిస్ట్
కిడ్నీ ట్నాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్

పది మందిలో ఒకరికి

మూత్ర పిండాల(కిడ్నీ) వైఫల్యం అనేది తీవ్ర ఆందోళనను కలిగించే ఒక ప్రధాన ప్రజా ఆరోగ్య సమస్యగా మారుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సాధారణ ప్రజానీకంలోని ప్రతి 10మందిలో ఒక వ్యక్తిని మూత్ర పిండ వైఫల్యం బాధిస్తోంది. మధుమేహం, అధిక రక్తపోటు, హృద్రోగాలు, మూత్రపిండంలో రాళ్లు, మూత్రపిండాల వ్యాధులను చరిత్రగా కలిగి ఉన్న కుటుంబాలు, పొగతాగడం, అధికబరువు, 65 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సును కలిగి ఉండడం వంటివి మూత్రపిండాల వ్యాధికి దారితీసే ప్రమాద కారకాలుగా చెప్పవచ్చు.

డాక్టర్ ఎస్.కృష్ణన్
సీనియర్ కన్సల్టెంట్ అపోలీ హాస్పిటల్స్

Comments

comments