Home తాజా వార్తలు మోర్ గోదాంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి…

మోర్ గోదాంలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి…

person with electric shock killed

వనస్థలిపురం: జూలై 26న వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల్‌కుంట మోర్ సూపర్ మార్కెట్ గోదాంలో విద్యుత్ షాక్‌తో కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత కుంటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కృష్ణాజిల్లా వచ్చవాయి మండలం కమ్మంపాడు గ్రామానికి చెందిన కంచర్ల అప్పారావు(26) తన భార్య శైలజ, ఇద్దరు పాపలతో కలిసి గత నెల రోజులుగా వస్థలిపురం డివిజన్ శ్రీనివాసపురం కాలనీలో నివాసం ఉంటు, చింతల్‌కుంటలోని మోర్ సూపర్ మార్కెట్ గోదాంలో పని చేస్తు జీవనం సాగిస్తున్నారు. కాగ అప్పారావు జూలై 26న సాయంత్రం 4.30లకు మోర్ సూపర్ మార్కెట్‌లో వస్తువులను కవర్లలో ప్యాకింగ్ చేస్తున్న సమయంలో ఆకస్మాత్తుగా విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న అప్పారావు కుటుంబ సభ్యులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని బాధితునికి న్యాయం చేయ్యాలని మోర్ యాజమాన్యాన్ని కోరారు.

దాంతో మోర్ యాజమాన్యం అప్పారావు విద్యుత్ షాక్‌కు గురికాలేదని అతడు అనారోగ్యంతో మృతి చెందాడని, వెంటనే మృతదేహాన్ని తీసుకువెళ్లామని హెచ్చరించారు. గత్యంతరం లేక వారు వనస్థలిపురం పోలీసులను ఆశ్రయించారు. కానీ పోలీసులు కూడ వెంటనే గోదాం నుండి మృతదేహన్ని తీసుకవెళ్లాలనీ లేని పక్షంలో తమపై హరాజ్‌మెంట్ కేసు పెడుతామని బెదిరించారని బాధిత కుటుంబ సభ్యులు వాపోయ్యారు. ఇదే విషయంపై బాధితులు మోర్ యాజమాన్యంను ఆర్థిక సహాయం చేయ్యాలని డిమాండ్ చేశారు. కానీ వారు 1లక్ష రూపాయాలను మాత్రమే ఇస్తాం, లేకుంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటు దురుసుగా ప్రవర్తించారని వారు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం కోరకు మిడియా ప్రతినిధులు గురువారం మోర్ సూపర్ మార్కెట్ గోదాంకు వెళ్లగా ఎవరికి అనుమతి లేదని తెలిపారు. అక్కడ ఉన్న కొంత మంది కార్మికులను విచారించగా అప్పారావు విద్యుత్ షాక్‌తోనే మృతి చెందాడని తెలిపారు. పోలీసులు మోర్ సూపర్ మార్కెట్ యాజమాన్యం నుండి అధిక మొత్తంలో డబ్బులు తీసుకుని అప్పారావు కుటుంబానికి అన్యాయం చేస్తు, కేసును నీరుగారుస్తున్నారని పేర్కొన్నారు. తమకు న్యాయం జరగని యెడల రాచకొండ సిపి మహేష్ భగవత్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగే వరకు పోరాడుతాం అని వారు తెలిపారు.