Search
Monday 24 September 2018
  • :
  • :

బుడ్డోడు కాదు… బుల్డోజర్

 జ్ఞాపక శక్తిలో నగర బాలుడి రికార్డు 

Memory-Power

మన తెలంగాణ/సోమాజిగూడ : జ్ఞాపక శక్తిలో తనకు తానే సాటి అని నిరూపించడమే కాకుండా … తన జ్ఞాపక శక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. తాను బుడ్డోన్ని కాను బుల్డోజర్‌ను అని పలువురిని ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. అతడే హైదరాబాద్ నగరం కొండాపూర్‌కు చెందిన శౌనక్ శశాంక్ ఓఖ్డే తన చిన్న తనం నుంచే అన్ని రంగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నాడు. తన ప్రతిభకు గుర్తింపుగా ఇటీవలే ఇండియన్ అచీవర్స్ బుక్ ఆఫ్ రికార్డ్ వారు అవార్డులను అందించారు.

దీనికి సంబంధించిన వివరాలను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో  శౌనక్ శశాంక్ తల్లిదండ్రులు శ్రీయ , శశాంక్ ఓఖ్డే లు విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నానక్‌రాంగుడలో నిది శ్రీరామ యూనివర్స ల్ స్కూల్‌లో పిపి 2 (రెండోవ తరగతి ) చదువుతున్నాడ ని తెలిపారు. చిన్నతనం నుంచి శౌనక్ చదువుతో పాటు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నాడని చెప్పారు. 196 దేశాల జెండాలు చూపించగానే ఆ దేశం పేరు వెంటనే చెప్పడంతో పాటు 6 ఖండాల పేర్లను సైతం తెలుపుతున్నాడని చెప్పారు. వీటితో పాటు సైక్లింగ్, స్విమ్మింగ్ స్వయంగా నేర్చుకున్నాడని తెలిపారు. తన ప్రతిభను గుర్తించి ఇండియన్ యంగెస్ట్ చైల్డ్ విత్ ఇంగ్రీడబుల్ మెమోరీ పవర్, ఇండియన్ యంగెస్ట్ మల్టీ టాలెంటెడ్ చైల్డ్ అవార్డులు వచ్చినట్లు చెప్పారు.

Comments

comments