Home తాజా వార్తలు రాష్ట్రంలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లు : నాయిని

రాష్ట్రంలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లు : నాయిని

NAINI

సంగారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని కొత్త పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. కోహిర్‌లోని ఓంకారేశ్వర ఆలయాన్ని ఆయన బుధవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో పోలీసుల పనితీరు బాగుందని ఆయన కితాబిచ్చారు. ఈ క్రమంలోనే గడిచిన మూడున్నరేళ్లలో ఒక్క అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోలేదని ఆయన చెప్పారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు నంబర్ వన్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జహీరాబాద్‌లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజలు పోలీసులకు సహకరించినప్పుడే శాంతిభద్రతల పరిరక్షణ సులభతరమవుతుందని ఆయన పేర్కొన్నారు.

More new police stations in the state : Naini