Search
Saturday 22 September 2018
  • :
  • :

ఆరోగ్యక్షేమ జామ

ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఖరీదైన పండే తినక్కర్లేదు. నిజం చెప్పాలంటే చెట్టుకు కాసే పండుకి ఖరీదు కట్టేది మనిషే కదా. పూర్వం దాదాపు అందరి ఇళ్లలో జామచెట్టు, మామిడిచెట్టు ఉండేవి. పిల్లలు ఆటపాటల్లో చెట్లు ఎక్కి కాయలు కోసుకోవడం, తినడం చేసేవాళ్లు. ఆరోగ్యంగా ఉండేవాళ్లు. ఇప్పుడా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జామచెట్లు అంతగా కనిపించటం లేదు. అందుకే తల్లిదండుల్రు కనీసం సెలవురోజు అయినా జామపండు కొని వారికి తినిపించాలి. దానిలోని పోషక విలువలు తెలియచేయాలి.

Guava-Fruit

జామకాయ వల్ల కండరాలు గట్టిపడతాయి. వాటి పైన లైట్ గీన్,్ర లైట్ పసుపు రంగులమేళవింపుతో ఉంటాయి. లోపల గుజ్జు లైట్ పింక్ కలర్‌తో కనిపిస్తుంది. వీటిలో రెండు, మూడు రకాలు ఉన్నాయి. కొన్ని పరిమాణంలో చిన్నగా ఉంటాయి. అవి అలానే పండిపోతాయి. ఒక రకం పెద్దగా  ఉంటాయి.  ఇప్పుడు కొత్తరకం బెంగుళూరు జామ కాయలు వస్తున్నాయి.  అవి కాయ ఒక్కింటికి దాదాపు రు.200ల దాకా వర్తకులు అమ్ముతున్నారు. జామ చెట్టుమీద చిలక కొట్టిన జామకాయలు ఇదివరకు తినేవాళ్లు. ఇప్పుడు అవి తినవద్దని వైద్యులు చెపుతున్నారు.

రుతుపవనాల రాకతో జామకాయల సీజన్ ప్రారంభమవుతుంది. జామపండు కొంచెం దోరగా ఉన్న ది మధుమేహ వ్యాధిగ్రస్తులను తినమని వైద్యులు సూచిస్తారు. దీనితో  సూప్, జామ్‌లు కూడా చేస్తున్నారు. జామకాయలు శరీరంలో కొవ్వు స్థాయిని తగ్గిస్తాయి. జామలో ఉండే అధిక ఫైబర్  జీర్ణకియ్ర వ్యవస్థను శుభ్రపరచి, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. దీనిలో విటమిన్ ఎ, ఇ, సి వల్ల చర్మానికి రక్షణ, ఇంకా కంటిచూపును మెరుగుపరుస్తుంది. జుట్టు రాలకుండా కాపాడుతుంది.  శరీర కండరాలను దృఢపరచి ఆరోగ్యవంతం చేస్తాయి. అరటిపండులో కన్నా జామకాయలో పీచుపదార్థం  ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆరోగ్యప్రదాయిని, బీదవారి ఫలం అని పేరున్న జామపండును అందరం తిందాం.

Hair Increased with Guava Leaf in Health Tips

Comments

comments