Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచాన్ని పీడిస్తున్న జనవిస్ఫోటనం

ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించడం గత మూడు దశాబ్దాలుగా ఆనవాయితీ అయింది. 1987 జూలై 11న ప్రపంచ జనాభా అయిదు బిలియన్లకు చేరుకొని రికార్డు సృష్టించింది. ఈ నేపథ్యంలో ఏటా జులై 11న ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తే ప్రపంచ దేశాలన్నిటికీ స్ఫూర్తి కలుగుతుందని గవర్నింగ్ కౌన్సిలు ఆఫ్ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ సిఫార్సు చేయడంతో 1989 నుంచి దీన్ని ఆచరించడం ప్రారంభించారు. జనాభా సమస్యలపై దేశాలన్నీ దృష్టి కేంద్రీకరించాలన్నదే దీని లక్షం. ఇదిలా ఉండగా 1968లో మానవ హక్కులపై అంతర్జాతీయ సదస్సు జరిగినప్పుడు కుటుంబ సంక్షేమమే ప్రధాన అంశంగా చర్చ జరిగింది. ‘కుటుంబ సంక్షేమం మానవ హక్కు’గా తెహ్రాన్ ప్రతిపాదనను సదస్సు స్వీకరించింది. ఈ సదస్సు జరిగి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 2018 లక్షం కుటుంబ సంక్షేమ సాధనగా స్థిరీకరించారు. ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా కుటుంబ సంక్షేమ హక్కుకు విస్తృత ప్రచారం కల్పించనున్నారు.

Population

ప్రపంచంలో అత్యధిక జనాభావల్ల కలిగే కష్ట నష్టాలను ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించడమే ఈ దినోత్సవ ఆశయం. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో కొన్ని కోట్ల మంది వివిధ భాషా సంస్కృతులతో జీవిస్తున్నారు. ప్రజలు తమ భవిష్యత్తు బాగోగుల గురించి నిత్యం ఆలోచిస్తుంటారు. ఆ మేరకు కొన్ని లక్షాలు సాధించాలని అనుకుంటారు. కొంతమంది విపరీతంగా శ్రమించి తమ లక్షాలను సకాలంలో సాధించగలుగుతారు. శ్రమతోపాటు నమ్మకం, అంకితభావం కూడా అవసరమవుతాయి. కొందరు కొన్ని లక్షాల సాధనకు అమితంగా కష్టపడవలసి వస్తుంది. మరికొందరు సులువుగా తాము అనుకున్నవి సాధించగలుగుతారు. ప్రజల్లో నైపుణ్యం, సమర్ధత వేర్వేరుగా ఉంటాయి. దీని ప్రకారమే వారి లక్షసాధన ఆధారపడి ఉంటుంది.

భారతదేశంలో ప్రస్తుతం 125కోట్లమంది నివసిస్తున్నారు. వివిధ రాష్ట్రాలు, వివిధ మతాలు, భాషా సంస్కృతులు వీరి జీవితాల్లో తొణికిసలాడుతుంటాయి. ప్రతి వ్యక్తి తనదంటూ ప్రత్యేక జీవనశైలితో, అభిప్రాయాలతో, ప్రణాళికలతో మెరుగైన జీవితం కోసం తాపత్రయ పడుతుంటాడు. సమస్త ప్రజానీక సంక్షేమంకోసం దోహదపడే ఆలోచన, ప్రణాళికలను ఆచరించడానికి సాధారణంగా ఎవరికి వారు విముఖత చూపిస్తుంటారు. కానీ విభిన్న ప్రాంతాల, దేశాల ప్రజలంతా ఒకే తాటిపైకి వచ్చి ఆర్థికపరంగా, సాంకేతికపరంగా, మౌలిక వనరుల పరంగా అభివృద్ధి సాధించడానికి, ప్రపంచం మొత్తం మీద ఈ లక్షాన్ని నెరవేర్చడానికి ముందుడుగు వేయాల్సిన అవసరం ఉంది. దేశాలన్నీ పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతి దేశంలో జనాభా పెరుగుదలకు దారితీసిన పరిస్థితులు, వాటివల్ల కలిగే కష్టనష్టాలు తెలుసుకుని ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఆలోచించక తప్పదు. భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో ప్రజలు తమ కుటుంబాలతో గడుపుతున్నా వారు అనుకున్నవి నెరవేరడం లేదు. పెద్దటవర ్లలో, భారీ భవనాల అంతస్తుల్లో హోదా గా గడపాలని కల లు కంటుంటారు. కా నీ కావలసిన ధనం లేక ఆర్థిక సమస్యలతో సతమతమ వుతుంటారు. అందువల్ల తమ కలలు నెరవేర్చు కోవడానికి తమ బాగోగుల కోసం కష్టపడక తప్పదు. కానీ ఆహారం, నీరు, మందులు, దుస్తులు, చదువు, నివాసం, తదితర కనీస మౌలిక సదుపాయాలు లేక కొన్నికోట్లమంది నరక యాతన అనుభవిస్తున్నారు. అత్యధిక జనాభా విస్ఫోటం ప్రమాదకరంగా తయారవుతోంది. భారతదేశం కన్నా చైనాలో అత్యధికంగా 150 కోట్ల జనాభా ఉంది. వీరందరూ జీవించడానికి తగిన అవసరాలు ఎన్నో సమకూర్చవలసి ఉంది. కానీ చైనా, భారత్ దేశాల్లో కనీస సదుపాయాలు ప్రజలకు సమకూరడం లేదు. భారతదేశంలో తినడానికి తిండిలేక అలమటిస్తున్న జనం కొన్ని లక్షలమంది ఉన్నారు. ప్రభుత్వంఎన్నో సంస్థలు, శిబిరాలు ప్రారంభించి వీరికి కావలసినవి సమకూర్చడానికి ప్రయత్నిస్తోంది.

వీటన్నింటికోసం ప్రభుత్వానికి ఆర్థిక వనరులు ఎంతో అవసరం. ఎవరైతే వేతనాలు, ఆదాయాలు సంపాదిస్తున్నారో వారి నుండి పన్నుల రూపంలో ఆదాయం సమకూర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జనాభాపై దృష్టి కేంద్రీకరిస్తేనే కానీ సమస్యలు పరిష్కారం కావు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా అనేక అంశాలు ప్రతిపాదనలో కి వచ్చాయి. 2015 లో జనాభా సమస్య అత్యంత ప్రమాదకరంగా ప్రతిపాదించారు. 2014 లో జనాభా సమస్యలపై స్పందించాల్సిన అవసరం ఉందని, యువతరం సంపాదనాపరులు కావాలని ప్రతిపాదించారు. 2013 లోయువతలో ముఖ్యంగా చిన్న వయస్సులో గర్భధారణ సమస్యగా పేర్కొన్నారు. 2012లో ప్రపంచ దేశాల అనుసంధానంగా ఆరోగ్య సేవల పునరుద్ధరణపై ప్రతిపాదించారు. 2011లో 7 బిలియన్ జనాభా అనువుగా చర్యల అవసరాన్ని సూచించారు. 2010 లో “నీకేం కావాలో చెప్పు దాన్ని గణనలోకి తీసుకో” అన్న సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. 2009లో“బాలికా విద్య ప్రతిదేశంలో పేదరికంపై పోరాటం”, 2008లో ‘కుటుంబ ప్రణాళికభవిష్యత్ ప్రణాళిక’ సిద్ధాంతీకరించారు. 2007లో ‘పురుషుల పని సామర్థం’, 2006 లో ‘యువతగా రూపొందడం కష్టం’, 2005లో ‘సమానతలో సాధికారత’ 2004లో ‘ఐసిపిడి లో 10అంశాలు’, 2003 లో ‘అరబ్ యువత’, 2002లో ‘అభివృద్ధి, జనాభా, పేదరికం, 2001 లో ‘పర్యావరణం, జనాభాకు తగిన అభివృద్ధి’ అంశాలపై ప్రతిపాదించారు. 2000లో ‘మహిళ జీవితాలలో భద్రత’, 1999 లో “ఆరు బిలియన్ జనాభా గణన’, 1998 లో ‘ఆరు బిలియన్లకు చేరువ’, 1997 లో ‘యువత ఆరోగ్య భద్రత’, 1996 లో ‘ఎయిడ్స్ ఆరోగ్య కరమైన సంతానం’ ప్రతిపాదనలు రూపొందాయి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆలోచనా సిద్ధాంతంపై ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఐక్యరాజ్య సమితి ప్రేరణ వల్లనే ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు. వాణిజ్య సంస్థలు, సామాజిక సేవా సంస్థలు, వివిధ రంగాల ప్రముఖులు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 1950 లో ప్రపంచ జనాభా 2.5 బిలియన్ వరకు ఉండగా ఇప్పుడు రెండింతలు అంటే 7.5 బిలియన్ వరకు ఉంది. 2050 నాటికి 9.7 బిలియన్ అవుతుందని అంచనా. 20 వ శతాబ్దం మధ్యలో చైనా 500 మిలియన్ మందికి ఆశ్రయం ఇస్తోంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక జనాభా కలిగిన దేశం చైనాయే.

ఆ తరువాత స్థానం భారత్. గత అర్థశతాబ్దం వరకు జనాభాలో చైనాయే అగ్రస్థానంలో ఉన్నప్పటికీ 2022 నాటికి భారత్ అధిగమించవచ్చని తెలుస్తోంది. 8 ఏళ్ల తరువాత మరో100మిలియన్ జనాభా అదనంగా భారత్‌లో పెరుగుతుందని అప్పటికి చైనాలో 1.4 మిలియన్ జనాభా మాత్రమే పెరుగుతుందని భావిస్తున్నారు. అత్యధికంగా జనాభా పెరుగుతున్న మరో దేశం నైజీరియా. 1950 లో నైజీరియా 37 మిలియన్ జనాభా ఉండగా, 2025 నాటికి 182 మిలియన్ కన్నా ఎక్కువ కావచ్చు. సంతానాభివృద్ధి ఈ దేశంలో ఎక్కువ. అలాగే యువత జనాభా కూడా ఎక్కువే. 2060 నాటికి జనాభాలో అమెరికా 3వ స్థానం వహిస్తుందని అంచనా. మరో అత్యధిక జనాభా గల దేశం కాంగో. 1950లో 12 మిలియన్ జనాభా ఉండగా, 2060 నాటికి 237 మిలియన్ కు చేరుకోవచ్చని చెబుతున్నారు. బ్రిటన్, జర్మనీ, ఇటలీ దేశాలు 1950 నాటికి అత్యధిక జనాభా గల దేశాలుగా ఉండేవి. ఇప్పుడు అంతగా వాటి పరిస్థితి లేదు.

పేదరిక నిర్మూలన ప్రకటన లేనా?

ప్రపంచ దేశాల్లో జనాభా తో పాటు పేదరికం, నిరుద్యోగం కూడా పెరుగుతోంది. అంతర్జాతీయ స్థాయిలో దేశాలన్నీకలిసి ఎన్ని సార్లు చర్చించినా, ఎన్ని ప్రతిపాదనలు చేసినా ఈ సమస్యలేవీ పరిష్కారం కావడం లేదు. దేశాల ప్రభుత్వాల విధానాలు పటిష్టమైన కార్యాచరణతో లేక పోవడమే ఈ లోపాలకు కారణం. 2000 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి ప్రేరణపై పేదరిక నిర్మూలన కోసం 139 దేశాలు తీర్మానం చేసి నా కార్యరూపం దాల్చలేదు. కనీసం పేదరికంలో సగమైనా 2015 నాటికి తగ్గించాలని మళ్లీ తీర్మానించారు. 2015 లో మళ్లీ 200 దేశాలు సమావేశమై పేదరికం సగం తగ్గిందన్న ధీమా పడ్డాయి. మరో 15 ఏళ్లలో పూర్తిగా పేదరికం నిర్మూలించాలన్న లక్షాన్ని నిర్దేశించుకున్నాయి. 2030 నాటికి ‘ఆకలి’ అన్న చిరునామా లేకుండా చేయాలని దృఢంగా నిర్ణయించుకున్నాయి. ఇలా ఎన్నిసార్లు ఎన్ని తీర్మానాలు చేయడమే తప్ప కార్యాచరణ

population-census

అమలులో చిత్తశుద్ధి కనపర్చడం లేదు.

సాంఘిక, ఆర్థిక కులగణన 2011 ప్రకారం మనదేశంలో గతంలో కంటే మరింతగా దారుణంగా పేదరికం తయారైంది. పట్టణాల్లో రోజుకు రూ. 33.40, గ్రామాల్లో రూ. 27.20 కన్నా కాస్త ఎక్కువగా సంపాదిస్తున్న వారిని దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు గానే పరిగణించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోణంలో అంచనా వేసినా పేదల సంఖ్య మన దేశంలో క్రమేపీ పెరుగుతోంది తప్ప తగ్గడంలేదు. 2008లో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసింది. ఆర్థిక సత్తా బాగా కలిగిన అమెరికా, ఇంగ్లండు వంటి దేశాలను పేదరికం, ఆకలి , నిరుద్యోగం వంటివి పట్టిపీడించగా ఇక మన లాంటి దేశాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కరలేదు. 2016 30 మధ్య 17 ‘స్థిరమైన అభివృద్ధి లక్షాలు’ (సస్టయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్) సాధించాలని దేశాలన్నీ తీర్మానించాయి. 2000 సంవత్సరంలో 8 సహస్రాబ్ది లక్షాలతో పాటు మామూలుగా 21 లక్షాలు, 60 సూచికలు నిర్ధారించారు. 2015 లో 175 సహస్రాబ్ది లక్షాలతోపాటు 169 లక్షాలు నిర్థారించారు. ఈ సహస్రాబ్ధి లక్షాలు (ఎమ్‌డిజి) ఎంతవరకు నెరవేరుతాయో తెలియడం లేదు. 1990 నాటి పేదరికాన్ని ప్రాతిపదికగా తీసుకోవడమే ఒక అభూతకల్పనగా విమర్శలు వచ్చాయి. భారతదేశం వెనుకబాటే వైఫల్యానికి ప్రధాన కారణంగా ఐక్యరాజ్యసమితి నివేదిక వెల్లడించింది. అయితే సహస్రాబ్ధి లక్షాలను ఒకవైపు౯ ప్రశంసిస్తూ మరోవైపు 15 సంవత్సరాలు అయినా‘ఎమ్‌డిజి’ల అమలు సరిగ్గా కాలేదని, ఇంకా 5.7 కోట్లమంది చిన్నారులు నిరక్షరాస్యులుగా మిగిలిపోయారని ఐక్యరాజ్యసమితి వ్యాఖ్యానించడం అది సఫలమో విఫలమో అర్థం కావడం లేదు.

ఈ లక్షాలన్నీ పూర్తిగా అమలు కావాలంటే జి 7 దేశాల ప్రభుత్వాలు రూ .350 కోట్ల డాలర్ల వరకు అదనంగా ఆర్థిక సహాయాన్ని అందించాల్సి ఉంటుందన్న అభిప్రాయం వెల్లడవుతోంది. 2010 ప్రపంచ బ్యాంకు వివరాలు పరిశీలిస్తే పేదదేశాలను అన్ని విధాలా ఆర్థికంగా ఆదుకుంటామని ఏఏ దేశాలయితే వాగ్దానాలు కుమ్మరించాయో ఆయా అభివృద్ధి చెందుతున్న దేశాలే ఆప్పులపై వడ్డీకింద 18,400 కోడ్ల డాలర్లు చెల్లించాయంటే అవి ‘ఎండిజి’లకు ఇస్తామన్న సహకారానికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. 1985 2010 మధ్య పేదదేశాలకు ఇచ్చిన దానికి, గుంజుకున్న దానికి మధ్య తేడా 53 వేల కోట్ల డాలర్లు. ఇన్ని చేసినా 2008 లో ప్రపంచదేశాలకు ఆర్థిక సంక్షోభం తప్పలేదు. ఈ నేపథ్యంలో పేదరిక నిర్మూలన కన్నా పేదరికానికి కారణాలపై దాని మూలాలపై పరిశీలనతో పాటు ప్రజల్లో విస్తృతంగా చర్చించేలా ప్రయత్నించడం ఎంతయినా అవసరం.

పి. వెంకటేశం

Comments

comments