Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

క్యూబాలో ఘోర విమాన ప్రమాదం…!

More than 100 passengers died in Boeing 737 Plane Crash in Cuba

హవానా: క్యూబాలో చోటుచేసుకున్న విమాన ప్రమాదంలో సుమారు 100 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. హవానాలోని జోస్‌ మార్టి ఎయిర్ పోర్టు నుంచి బోయింగ్‌ 737 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఒక్కసారిగా మంటలు చెలరేగి కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. హోల్గున్‌కు వెళ్లాల్సిన విమానం బోయ్‌రోస్‌, శాంటియాగో డీ లావెగాస్‌ గ్రామాల మధ్య పొలాల్లో కుప్పకూలిపోయింది. ప్రమాద జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. క్షతగాత్రులను చికిత్స కోసం హవానాలోని ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను అధికారులు గుర్తించే పనిలో ఉన్నట్టు క్యూబా అధ్యక్షుడు డియాజ్ కేనల్ తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై  అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు.

Comments

comments