Home కెరీర్ రైల్వేలలో ఉద్యోగాల జాతర

రైల్వేలలో ఉద్యోగాల జాతర

రైల్వేలలో18వేల ఖాళీల భర్తీ
Train1* రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) సెంట్రల్ ఎంప్లాయ్‌మెంట్ నోటిఫి కేషన్ ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 18వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
* ఇవి నాన్‌టెక్నికల్ కేటగిరీ పోస్టులు. దేశంలోని పలు రైల్వేజోన్లు, ప్రొడక్షన్ యూనిట్స్‌లో మొత్తం ఖాళీల సంఖ్య – 18252
విభాగాల వారీగా ఖాళీలు
* కమర్షియల్ అప్రెంటీస్ – 703
* ట్రాఫిక్ అప్రెంటీస్ – 1645
* ఎంక్వైరీ కమ్ రిజర్వేషన్ క్లర్క్ – 127
* గూడ్స్ గార్డ్ – 7591
* జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ – 1205
* సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ – 869
* అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ – 5942
* ట్రాఫిక్ అసిస్టెంట్ – 166
* సీనియర్ టైమ్ కీపర్ – 4
* దరఖాస్తుకు చివరితేదీ: 2016, జనవరి 25
* ఈ ఖాళీల భర్తీ ప్రక్రియలో పాల్గొనే ఆర్‌ఆర్‌బీ బోర్డులు
అహ్మదాబాద్, అజ్మీర్, అలహాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీగఢ్, చెన్నై, గోరఖ్‌పూర్, గుహవటి, జమ్ము – శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం.
* పూర్తి వివరాలు 2015, డిసెంబర్ 26న ప్రచురించే ఎంప్లాయ్‌మెంట్‌న్యూస్‌లో లేదా http://rrb secunderabad.nic.inసైట్‌లో చూడవచ్చు.
BHELలో ఉద్యోగాలు
* భోపాల్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)లో తాత్కాలిక ప్రాతిపదికన వివిధ ఐటీఐ ట్రేడ్‌ల్లో అప్రెంటీస్ చేయడానికి అర్హులైన అభ్య ర్థుల నుంచి అకాడమిక్ ఇయర్ 2016-17కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
* పోస్టులు-వివరాలు:
* ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్
* మొత్తం అప్రెంటిస్ సంఖ్య: 682 (జనరల్-342, ఓబీసీ-102, ఎస్సీ-102, ఎస్టీ-136)
* ట్రేడ్ విభాగాల వారీగా ఖాళీలు:
* ఎలక్ట్రీషియన్-140, ఫిట్టర్-196, మెషినిస్ట్-93, వెల్డర్-98, టర్నర్-48, కంప్యూటర్-33, డ్రాఫ్ట్ మ్యాన్ (మెకానిక్)-14, ఎలక్ట్రానిక్ మెకానిక్-12, మెకానిక్ మోటార్ వెహికల్-15, మెషినిస్ట్ గ్రైండర్-10, మాసన్-5, పెయింటర్-6, కార్పెంటర్-4, ప్లంబర్-8
* అర్హత: పదో తరగతి, ఎన్‌సీవీటీ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత
* వయస్సు: 2016 మార్చి 31 నాటికి 25 ఏళ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, బీహెచ్‌ఈఎల్ ఎంప్లాయ్ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
* ఎంపిక:ట్రేడ్ పరీక్ష/ ఇంటర్వ్యూ
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసి, జతపర్చాల్సిన సర్టిఫికెట్లను జతచేసి ఆర్డినరీ పోస్ట్‌లో సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
* ఆన్‌లైన్ దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: 2016 జనవరి, 2
* ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపించడానికి చివరి తేదీ: 2016 జనవరి, 9
* వివరాలకు http://wwwbhelbpl.co.in.వెబ్‌సైట్ చూడండి.
ఇండియన్ నేవీలో సెయిలర్స్
* ఇండియన్ నేవీ సెయిలర్స్ ఫర్ ఆర్టిఫీషియర్ అప్రెంటీస్ 140 బ్యాచ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆగస్టు 2016లో ఈ కోర్సుమొదలౌతుంది.
* సెయిలర్
* అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. మ్యాథ్స్, ఫిజిక్స్ తోపాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ/కంప్యూటర్‌సైన్స్‌ల్లో ఏదో ఒక సబ్జెక్టును కలిగి ఉండాలి.
* వయస్సు: 1996, ఆగస్టు 1 నుంచి 1999, జూలై 31 మధ్య జన్మించి ఉండాలి.
* పే అండ్ అలవెన్స్‌లు: రూ. 5200 – 20200 + గ్రేడ్ పే రూ. 2000/ + ఇతర అలవెన్స్‌లు ఉంటాయి.
* పదోన్నతులు:
మాస్టర్ చెఫ్ పెట్టీ ఆఫీసర్ -1 స్థాయి వరకు (సుబేదార్ మేజర్ స్థాయికి సమానం) పదోన్నతి లభిస్తుంది. అదేవిధంగా విద్యార్హతల ప్రకారం, పని తీరును బట్టి కమిషన్డ్ ఆఫీసర్ వరకు కూడా పదోన్నతిని పొందవచ్చు.
* ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా చేస్తారు.
* రాతపరీక్ష: ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్‌ల్లో ఉంటుంది.
* పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
* ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్‌నాలెడ్జ్‌పై ప్రశ్నలుం టాయి.
* పరీక్షలో ప్రశ్నలు ఇంటర్‌స్థాయిలో ఉంటాయి.
* పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు. పరీక్షలో అన్ని సెక్షన్స్‌లో తప్పక క్వాలిఫై కావాలి.
పీఎఫ్‌టీ (ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్):
* అభ్యర్థుల ఎంపికకు ఇది తప్పనసరిగా క్వాలిఫై కావాలి.
* శారీరక ప్రమాణాలు:
* కనీసం 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు, ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ వ్యాకోచించాలి.
* శిక్షణ: ఆగస్టు 2016 నుంచి ప్రారంభమవుతుంది. ట్రేడ్స్/ బ్రాంచీలను బట్టి ఆయా నావికా శిక్షణ కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ఐఎన్‌ఎస్ చిల్కలో శిక్షణ ఉంటుంది.
* దరఖాస్తు: ఆన్‌లైన్‌లో చేయాలి.
* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న తర్వాత రెండు కాపీ లను ప్రింట్ తీసుకొని, వాటికి అటెస్ట్‌చేసిన అర్హతకు సంబంధించిన సర్టిఫికెట్స్‌ను జతచేసి కింది చిరు నామాకు 2016, జనవరి 3లోగా చేరేలా పంపాలి.
* పోస్టు బాక్స్ నంబర్ – 476,
గోల్‌డాక్ ఖానా, జీపీవో, న్యూఢిల్లీ – 110001
* వివరాలకు www.joinindianarmy.gov.inవెబ్‌సైట్ చూడండి.