Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

మూఢత్వాన్ని పారదోలితేనే సమాజ ప్రగతి

witch-doctorఅక్షరాస్యులు, నిరక్షరాస్యులు, గ్రామీణ, పట్టణ, ధనిక, పేద, పండితుడు, పామరుడు అనే తేడా లేకుండా అధికశాతం ప్రజలలో ఒక విష యాన్ని గుడ్డిగా, మూఢంగా నమ్మే సంస్కృతి ఈ మధ్య పెరుగుతోంది. ఎక్కువమంది చేసే పని ఏదైనా మంచిదే అనే భావనతో ఉన్న ప్రజలు ఆ పని చేయడానికి ఎంత శ్రమ, ఖర్చుకైనా వెనుకాడడం లేదు. సమాచార, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మూఢత్వం బహుళవ్యాప్తిలోకి వస్తున్నది. ప్రజలు ప్రశ్నించేతత్తానికి దూరంగా నెట్టబడుతున్నారు. హేతువాద భావనలు లోపిస్తు న్నాయి. ప్రతి విషయాన్ని తరచిచూసి, ప్రశ్నించి ఎందుకు? ఏమిటి? ఎలా? అని ఆలోచించి స్వీయ నిర్ణయం తీసుకునే వారు కొద్దిమందే ఉంటున్నారు. మార్గదర్శకాలుగా ఉండాల్సిన విద్యావంతులు, పాల కులు, శాస్త్రవేత్తలు కూడా అశాస్త్రీయ ఆలోచనలు, నమ్మకాలను పాటించడంవల్ల వారిని చూసి మనం కూడా చేయడంలో తప్పేమి లేదని ఇతరులు భావిస్తు న్నారు.
సమాజంలో పెరుగుతున్న మూఢత్వానికి ఉదా హరణలు కోకొల్లలు. జార్ఖండ్‌లో సిందేగా జిల్లాలో మాంత్రికులు అనే నెపంతో వృద్ధదంపతులను ఊరు ఊరంతా కలిసి హత్యచేశారు. చేతబడి, బాణామతి, మంత్రాలు అనే ప్రాచీన యుగం నాటి మూఢనమ్మ కాలతో నేటికి గ్రామాలు, పట్టణాలలో పూజలు చేసే వారున్నారు. వీరు ప్రజలకు చిన్నచిన్న తాయెత్తుల దగ్గరనుండి మంత్రాల వరకు ప్రజలను నమ్మించి దోపిడి చేస్తున్నారు. దురదృష్టవశాత్తు అదే ప్రజల చేతుల్లో ఏదో ఒక రోజు వీరు బలవుతుంటారు. క్షుద్రశక్తుల ఉపాసనకు ఉపయోగపడే ‘మలివేలు’ అనే నల్లపిల్లి 20లక్షల ధర పలుకుతుంది. నగ్నంగా పూజలు చేస్తే ‘కాసులవర్షం’ కురుస్తుందంటూ మంచిర్యాలలో ఒక దొంగ స్వామీజీ ముగ్గురు మహిళలను నమ్మించిన ఉదంతం మరో ఉదా హరణ. నేడు ప్రతి ఊరిలో చేయి చూసి జోస్యం చెప్పే ‘అమ్మ లు’ తయా రయ్యారు. వీరు తప్పిపోయిన పశువుల జాడ చెప్ప డం, దొంగిలించ బడిన వస్తువులు ఎక్కడికెల్లాయో చెప్పడం, రోగాలు నయం చేయడం, పేదల కష్టాలు ఎన్నడు తీరతాయో చెప్పడం వంటివి చేస్తూ అందినంత సామాన్యుల నుంచి దోచుకుంటున్నారు. కొందరైతే ఇల్లిల్లు తిరుగుతూ నరదిష్టి తొలగిస్తామని, శనిదోష నివారణ చేస్తామని నమ్మబలికి యంత్రాలు, తాయె త్తులు, పూజలు జరిపించి దండుకుంటు న్నారు. రాత్రిపూట ఇండ్లముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు, జీడిగింజలు, బియ్యం ఉంచి ప్రజ లను భయపెట్టి క్షుద్ర పూజలద్వారా వీటిని తొలగిస్తామని పేదలను నిలువుదోపిడి చేస్తున్నారు. గ్రామంలో వరుసగా చనిపోయిన ముగ్గురు వ్యక్తుల మరణానికి కారణ మని ఐదుగురు మహిళలను కర్రలతో కొట్టి చిత్రవధ చేసి ఊరవతల పారేసిన ఘటన రాంచీ జిల్లాలో జరిగింది. 21వ శ॥లో అంగారకునిపై నీటి జాడలు కని పెడుతున్న ఈ సాంకేతిక యుగంలో కూడా బాహ్యప్రపంచం కంటే మన సమాజం ఎంత వెనుక బడి ఉందో పై సంఘటనలు కొన్ని వివరిస్తున్నాయి.
రాజ్యాంగంపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులైన మన పాలకులు ఆదేశిక సూత్రాలలో చెప్పిన “శాస్త్రీయ దృక్పథం” అనే భావనకు విరుద్ధం గా మూఢత్వాన్ని పెంచి పోషిస్తున్నా రు. తాము రాజ్యాంగ పదవులలో ఉన్నా మనే విషయాన్ని మరిచి బాబాల కాళ్లకు మొక్కడం, రహస్యంగా ఆల యాల్లో యజ్ఞాలు, యాగాలు జరపడం, వర్షాలు పడాలంటే ప్రజ లందరూ పూజలు చేయాలని పిలుపునివ్వడం, వంటి వాటిద్వారా మూఢభక్తిని పెంచిపోషిస్తు న్నారు.
సమాజం నూతనత్వంతో తొణికిసలాడాలంటే పాతవెనకబడిన ఆలోచనలు, నమ్మకాలను వది లించుకోకతప్పదు. ఈ మూఢత్వభావాలను క్రమం గా తొలగించేందుకు ప్రభుత్వం శాస్త్రీయ ఆలో చనా విధానాన్ని విరివిగా ప్రచారం చేయాలి. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్య మాలు తమ వంతు పాత్ర పోషించాలి. విద్యా లయాలలో ‘శాస్త్రీయ’ దృక్పథాన్ని హేతువాదాన్ని పెంచే సిలబస్ బోధనా విధానం ఉండాలి. విశ్వ విద్యాలయాలను ‘మతపరమైన’ ఆలోచనా వేదికలు గా మార్చ కూడదు. మంత్రతంత్రాల పేరుతో పూజలు జరిపే దొంగ పూజారులు, బాబాలను ప్రత్యేక డ్రైవ్ ద్వారా గుర్తించి ఏరివేయాలి.
శాస్త్రీయ భావాలను ప్రోత్స హించే మేధావులను, సంస్థలకు విరివిగా నిధులు అంద జేయడం ద్వారా ప్రత్యక్షంగా ప్రోత్స హించాలి. ఇస్త్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహాల ప్రయో గానికి ముందు దాని నమూనాను తిరుపతికి తీసు కెళ్ళే మూఢ విశ్వాసాన్ని ముందు రద్దు చేయాలి. ఇది సైన్స్‌కు విరుద్ధచర్య. సర్పంచ్‌నుండి రాష్ట్రపతి వరకు ప్రతినేత తమ పదవీకాలంలో ‘లౌకిక’ ఆలోచనలు వ్యాప్తి చేయాలి. నవ సమాజ నిర్మాణం కోసం నడుం బిగించిన మేధావులు, కవులు, కళాకారులను ప్రోత్స హించాలి. వారి ప్రాణాలకు తగు రక్షణ కల్పించాలి. బాలలకు “శాస్త్రీయ విద్య” నందిం చాలి. ప్రస్తుత సైన్స్ బోధన వారిని పూర్తిస్థాయి శాస్త్రీయ పౌరులుగా తీర్చిదిద్దడంలో విఫలమవు తుంది. అందువల్ల “ఆచరణాత్మక శాస్త్రీయ విద్య” కావాలి. ఈనాటి సామాజిక రాజకీయ పరిస్థితులలో ఇది అత్యాశే కావచ్చు. కాని ఇతర రంగాలలో అభివృద్ధికి అనుగుణమైన జ్ఞానసమాజం నిర్మాణం అవసరం.
రచయిత ః కాకతీయ సోషల్ స్టడీస్‌ఫోరం ప్రధాన కార్యదర్శి, తొర్రూరు, వరంగల్
9491822383

Comments

comments