Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

బాబోయ్ దోమలు

11BDN204Bకోటగిరి: మండల కేంద్రంలోని ఆయా కాలనీల ప్రజలు దోమల బెడదతో హడలెత్తిపోతున్నారు. పారిశుద్ధ నిర్వహణ లోపం, సరైన మురుగునీటి పారుదల వ్యవస్థ లేకపోవడం, రోడ్డుపైనే మురుగునీరు నిలిచిపోవడంతో దోమలు స్వైర విహరానికి అడ్డు అదుపులేకుండా పోతుంది. పగలంత వాహనాలతో బాధ, రాత్రి రాగానే దోమలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వాటి నివారణకు లిక్విడ్, సంహరకాలు, జెట్‌కాయిల్స్ వాడుతున్న ఉపయోగం లేకుండా పోతుంది. దోమల బారి నుండి అనేక వ్యాధులు వస్తాయనే భయంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

గ్రామ పంచాయతీ ప్రజాప్రతినిధులు పట్టించుకొని ఆయా కాలనీలలో ఫాగింగ్ చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. లేకుంటే దోమకాటు వ్యాధి బారిన పడే ప్రమాదముందని ఆయా కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా కోటగిరి మండల కేంద్రంలో ఇప్పటికి ఇద్దరికి డెంగ్యూ వ్యాధి వచ్చింది. గత రెండు వారాల నుండి తీవ్ర జ్వరంతో వారు బాధపడడంతో ఇంట్లోవారు అప్రమత్తమై హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రక్త పరీక్షలు జరిపిన అనంతరం డెంగ్యూ వ్యాధి ఉందని డాక్టర్లు చెప్పడంతో కుటుంబ సభ్యులు భయబ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం మండల వైద్య 11BDN204Aఅధికారులకు తెలియగానే నామమాత్రంగా రోగి ఇంటి వద్ద వచ్చి స్థితిగతులు తెలుసుకొని ఆ రోగి ఇంటి చుట్టూ దోమల మందు పిచికారి చేసి చేతులు దులుపుకున్నారు.

మండల వైద్య అధికారులు గ్రామాల్లో పదే పదే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉచకోత ఉపన్యాసాలతో సమావేశాలు జరుపుతున్న ఏమి ప్రయోజనం లేకపోతుంది. వైద్య అధికారులు ముందస్తున్న దోమల మందు పిచికారి చేస్తే డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాకుండా ఉండేవి. వ్యాధి రాగానే నామమాత్రంగా అప్రమత్తమైన వైద్య సిబ్బంది డెంగ్యూ వ్యాధిన రోగి ఇంటి ముందు పిచికారి గమన్హరం. ఇప్పటికైన మండలంలోని ఆయా గ్రామాలలో మరియు కోటగిరిలో దోమల నివారణ మందులు మురికి కాలువల్లో పిచికారి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

comments