Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

మాత శిశుమరణాలను అరికట్టాలి: కలెక్టర్

Collector

మంచిర్యాలరూరల్: ప్రసవ సమయానికిముందే ఆసుపత్రుల్లో గర్భిణీలను చేర్పించి మాతా,శిశుమరణాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వీకర్ణన్ వైద్యసిబ్బందికి సూచించారు. శనివారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లాలో వైద్య,ఆరోగ్యశాఖ పనితీరుపై ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది,అంగన్‌వాడి సూపర్‌వైజ ర్లు, సిడిపిఓలతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు. పిహెచ్‌సిల వారిగా గర్భీణీల నమో దు,ఆసుపత్రుల్లో ప్రసవాలను వాకబు చేశారు.ఈ నెల 5వ తేదీన జన్నారం మండల ంలోని తిమ్మాపూర్‌కు చెందిన గర్భీణీ ముల్కల్ల రాజమణి ఇంటిలో పురుడు పోసుకో వడం వలన సరియైన వైద్యం అందక తల్లితో పాటు బిడ్డ పురిటిలోనే చనిపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ప్రసవం తేదీముందే తెలిసిన గర్భీణీని ఆసుపత్రికి తీసుకవెళ్ళి పురుడుపోయడంలో నిర్లక్షం వహించిన వైద్యులకు,ఇతర వైద్యసిబ్బం దికి షోకాజు నోటీసులు అందజేయాలని జిల్లా వైద్యఅధికారిని ఆదేశించారు. ఇలా ంటి సంఘటనలు జిల్లాలో ఎక్కడా జరిగిన కఠిన చర్యలు తప్పవన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో మాతా,శిశు మరణాలు జరిగిన సంబంధిత వైద్యసిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గర్భిణీ వివరాలను ముందు నుండే పక్కాగా నమోదు చేసి ప్రసవ తేదీకి రెండు,మూడు రోజుల ముందు ప్రభుత్వాసుపత్రిలో చేర్పించి ఆసుపత్రులోనే ప్రసవం జరిగేలా చూడాలన్నారు. ప్రతి ఆసుపత్రిలో గర్భీణీలు,ప్రసవాల రిజిస్టార్‌ను తప్పకుండా నమోదు చేయాలన్నారు. గర్భీణీలు అత్తవారి నుండి తల్లిగారి ఇంటికి ప్రసవం కోసం వెళ్ళితే సంబంధిత ప్రాంత ఎంఎస్‌ఎంలకు సమాచారం అందించాలన్నారు.

గిరిజన ప్రాంతాల్లో ఆసుప త్రుల్లో ప్రసవాలపై అవగాహన కల్పించాలని,ఇందుకు వైద్యసిబ్బందితో పాటు స్వ యం సహాయక సంఘాల మహిళాలను, ఆయాగ్రామాల్లోని చైతన్యవంతమైన ప్రజల సహాయం తీసుకోవాలన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను తప్పకుండా ఉపయోగించాలని స్కానింగ్ స్దానికంగానే నిర్వహిం చాలని,సాధ్యమైనంత వరకు అవసరమైన సర్జరీలను ప్రాథమికంగా,కమ్యూనిటి ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించాలని వారం రోజుల్లోగా బెల్లంపల్లిలోని ప్రాంతీయ ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ పూర్తి స్దాయిలో వినియోగంలోకి తీసుకొని రావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్లంపల్లి స్పెషల్ డిప్యూటి కలెక్టర్ ప్రియాం క,డిఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్ ఎ భీష్మ,జిల్లా సంక్షేమాధికారిరవూఫ్‌ఖాన్, మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ ప్రత్యేకాధికారిని డాక్టర్ అరుణశ్రీ,అడిషనల్ డిఅండ్ హెచ్‌ఓలు డాక్టర్ అనిత,డాక్టర్ సునీల్,మంచిర్యాల ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యశ్వంత్‌రావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సత్యనారాయణ, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ చంద్ర మోళి,అన్ని పిహెచ్‌సిల డాక్టర్లు,హెల్త్ సూపర్‌వైజర్లు, అంగన్‌వాడి సూపర్‌వైజర్లు, ఎఎన్‌ఎం,ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments