Search
Friday 16 November 2018
  • :
  • :

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం : తల్లి, బిడ్డ మృతి

Road-Accident

ప్రకాశం : జిల్లాలోని మార్కాపురం మండలం రాయవరం గ్రామానికి చెందిన ఓ కుటుంబం వివాహానికి వెళ్లి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తల్లీ బిడ్డలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రాయవరం నుంచి కులూకూరి కొండయ్య ఆతని భార్య మేరీ (26), కుమారుడు కౌశిక్(4)లతో కలిసి కంచేపల్లిలో వివాహానికి వెళ్తున్నాడు. పొదలి సమీపంలో కనిగిరి నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసి బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో బైక్ అదుపు తప్పి తల్లీ, బిడ్డలు బస్సు వెనుక చక్రం కింద పడి చనిపోయారు. ఈ ప్రమాదంలో కొండయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం పొదలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సిఐ తెలిపారు.

Comments

comments