Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తల్లీకూతుళ్ల ఆత్మహత్య

SUICIDE1

చిత్తూరు : వి.కోట మండలం దాసర్లపల్లిలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ గ్రామానికి చెందిన అనసూయమ్మ (43), సునీత (18)లు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నారు. కొడుకు అనుచిత ప్రవర్తన కారణంగానే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల క్రితం వీరి పక్కింట్లోండే మహిళ స్నానం చేస్తుండగా అనసూయమ్మ కొడుకు వీడియో తీశాడు. దీన్ని గమనించిన పొరుగింటి వారు అతడికి దేహశుద్ధి చేశారు. దీంతో అనసూయమ్మ, ఆమె కూతురు మనస్థాపానికి గురయ్యారు. ఈ క్రమంలో వారు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు విచారిస్తున్నారు.

Comments

comments